జీరో వేస్ట్ కుకింగ్ బెస్ట్
on Apr 30, 2020

'ఏముంది? తొక్కే కదా అని తీసిపారేయకండి' అంటోంది బాపు బొమ్మ ప్రణీత సుభాష్. జీరో వేస్ట్ కుకింగ్ బెస్ట్ అని ఆమె చెబుతోంది. కాయగూరల తొక్కలతో పచ్చడి చేసుకోవచ్చని చేసి మరీ చూపెడుతోంది. ప్రణీత ఈరోజు కొత్తగా కనుగొన్నదేమీ కాదిది. భారతీయ జీవన విధానంలో ఎప్పటినుండో ఉన్నదే. ఇప్పుడు మరోసారి ఆమె వల్ల ప్రాచుర్యంలోకి వస్తోంది. దీనంతటికీ కారణం కరోనాయే.
ఆకలి వేస్తే బర్గర్లు, పిజ్జాల వెనుక పరుగులు తీసిన ఈతరం యువత... కరోనా కారణంగా వచ్చిపడిన లాక్ డౌన్ వల్ల, ఇప్పుడు ఆకలి వేస్తే ఇంటిలో అమ్మ వెనక తిరుగుతున్నారు. 'తినడానికి ఏమైనా పెట్టు' అని! మాక్ టైల్, కాక్ టైల్ అంటూ పబ్బుల్లో పార్టీలు చేసుకున్న ప్రజలు అందరూ, ఇప్పుడు పొద్దున్నే ఇమ్యూనిటీ పెరగడం కోసమని ఇంట్లో చేసిన కాషాయం తాగుతున్నారు. కరోనా వల్ల వచ్చిన మార్పు ఇది. ఇదొక్కటే కాదు... ఈ సమయంలో ఆహారం వృధా చేయకూడదని, పొదుపుగా వాడుకోవాలని కొందరు 'జీరో వెస్ట్ కుకింగ్' గురించి అవగాహన కల్పిస్తున్నారు. బీరకాయ, సొరకాయ తదితర కూరగాయల తొక్కలతో పచ్చడి చేసే సంస్కృతి మన దగ్గర ఎప్పటినుండో ఉంది. మరోసారి ఆ విధానాలను గుర్తు చేస్తున్నారు.
"తొక్క తీసిన వెజిటేబుల్స్ తో మేం కర్రీ చేస్తాం. తొక్కలతో పచ్చడి చేస్తాం. అందువల్ల, వెజిటేబుల్స్ వేస్ట్ కావడం అనేది ఉండదు" అని ప్రణీత తెలిపారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



