ప్రభాస్ స్పెషల్ భోజనాన్ని దక్కించుకున్న హీరోయిన్
on Jan 31, 2025
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas)ప్రస్తుతం 'దిరాజాసాబ్'(The Rajasaab)తో పాటు 'హను రాఘవపూడి'(Hanu Raghavapudi)దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీలోను చేస్తున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది.ప్రభాస్ తో పాటు చిత్ర యూనిట్ పై దర్శకుడు కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరిస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఈ మూవీలో సోషల్ మీడియా స్టార్ 'ఇమాన్వి'(Imanvi)హీరోయిన్ గా చేస్తున్న విషయం తెలిసిందే.ప్రభాస్ రీసెంట్ గా తన ఇంటి నుంచి ఇమాన్వి కి భోజనాన్ని పంపించాడు.వాటిల్లో వెజ్ తో పాటు,నాన్ వెజ్ కి చెందిన పలు రకాల వంటకాలు ఉన్నాయి.ప్రభాస్ తనకి భోజనాన్ని పంపించిన ఈ విషయాన్నీఇమాన్వి నే సోషల్ మీడియా వేదికగా తెలియచేసింది.భోజనాన్ని పంపించిన ప్రభాస్ కి దన్యవాదాలు,ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉందంటు ట్వీట్ చేసింది.
ప్రభాస్ గతంలో కూడా దీపికా పదుకునే,కరీనా కపూర్,సైఫ్ అలీ ఖాన్,శృతి హాసన్,నిధి అగర్వాల్,మాళవిక మోహన్ కి కూడా తన ఇంటి నుంచి భోజనాలు పంపించాడు.ఈ విషయాన్నీ ఆయా నటులు కూడా సోషల్ మీడియా వేదికగా తెలియచేయడం జరిగింది.ప్రభాస్ ఒప్పుకున్న సినిమాల లిస్ట్ ఒకసారి చూసుకుంటే ది రాజాసాబ్,హను రాఘవపూడి సినిమాతో పాటు సలార్ 2 ,సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ చిత్రాలు ఉన్నాయి.ప్రభాస్ ఈ సినిమాల షూటింగ్స్ ని వెంట వెంటనే పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నాడు.హను రాఘవపూడి మూవీకి 'ఫౌజీ' అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
