పవర్‌స్టార్‌తో కొలవెరి..!
on Oct 7, 2016

సూపర్‌స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ పాడిన వై దిస్ కొలవెరి డీ సాంగ్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఆ సాంగ్‌తో నేషనల్ వైడ్ పాపులారిటీ సంపాదించుకున్నాడు ధనుష్..పాట పాడిన వారికే అంత రేంజ్ వస్తే మరి దానికి మ్యూజిక్ కంపోజ్ చేసిన వాడికి. ఖచ్చితంగా అంతకు మించిన ఫేమ్ వచ్చి తీరుతుంది. ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కాదు అనిరుధ్ రవిచందర్. 20 ఏళ్ల వయసులో అనిరుధ్ సృష్టించిన సునామీ అది. ఆ తర్వాత చాలా తమిళ హిట్ సినిమాలకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు అని. అతను కంపోజ్ చేసిన పాటలు తెలుగులోకి కూడా డబ్బయి ఇక్కడి వారిని కూడా అలరించాయి. అయితే ఈసారి స్ట్రట్ తెలుగు మూవీకి మ్యూజిక్ ఇవ్వబోతున్నాడట అనిరుధ్.
అది కూడా అలాంటి ఇలాంటి హీరోకి కాదు..ఏకంగా పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ సినిమాకి. పవన్, త్రివిక్రమ్ కాంభినేషన్‌లో తెరకెక్కునున్న సినిమాకు అనిరుథ్‌ని మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకోవాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడట. అ ఆ సినిమాకు అనిరుధ్‌ని అనుకున్నా..లాస్ట్ మినిట్‌లో మిక్కీజే మేయర్‌తో రీప్లేస్ చేయాల్సి వచ్చింది. అయితే ఈ సారి మాత్రం మిస్సయ్యేది లేదంటున్నాడు మాటల మాంత్రికుడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



