పవన్‌కి త్రివిక్రమ్ 'పొలిటికల్' టచ్
on Oct 5, 2016
.jpg)
మరోసారి పవన్ కల్యాణ్ త్రివిక్రమ్‌లు కలసి జల్సా చేయించడానికి సిద్దమయ్యారు. వీరిద్దరి కలయికలో ముచ్చటగా మూడో సినిమారాబోతోంది. ఈ సినిమాకి `దేవుడే దిగి వచ్చినా` అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... ఈ సినిమా ఓ పొలిటికల్ డ్రామా అని తేలింది. వినోదం, యాక్షన్‌లతో పాటు.. త్రివిక్రమ్ ఈ స్క్రిప్టుకి పొలిటికల్ టచ్ ఇచ్చినట్టు సమాచారం. 2019 ఎన్నికల్లో పవన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగబోతున్నాడు. అందుకు సన్నద్దంగా ఈసినిమా ఉండబోతోందని తేలింది. దేవుడే దిగి వచ్చినా మారని ఈ సమాజం.. ఏ దేవుడి లాంటి వ్యక్తి వల్ల ఎలా మారిందన్న పాయింట్ చుట్టూ ఈ కథ నడుస్తోందని, అందుకే ఈ టైటిల్ పెట్టారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. పవన్ - త్రివిక్రమ్ కలయికలో కోబలి సినిమా వస్తోందనుకొన్నారు. ఆ సినిమాకి భారీ స్థాయిలో బడ్జెట్ అవసరం అవుతుందట. పైగా అదో ఆర్ట్ సినిమా తరహాలో ఉంటుందట. అందుకే ప్రస్తుతానికి ఆ కథ పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. 2016 డిసెంబరులోగానీ 2017 జనవరిలో గానీ ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



