డైరెక్టర్ వేధింపులు..హీరోయిన్ ఆత్మహత్యాయత్నం
on Oct 5, 2016

చిత్ర పరిశ్రమలో కొత్తగా వచ్చే హీరోయిన్లకు వేధింపులు మరి ఎక్కువైపోతున్నాయి. అందరూ కాదు కాని కొందరు దర్శక, నిర్మాతలు వర్థమాన తారలను ప్రేమ పేరిట వేధించడమో..అసభ్యపదజాలంతో దూషించడమో చేస్తున్నారు. కెరిర్ కోసం కొందరు అమ్మాయిలు మనసు చంపుకుని భరిస్తుండగా..మరి కొందరు మాత్రం ఇది తట్టుకోలేక తనువు చాలించాలనుకుంటున్నారు. తాజాగా మళయాళం, తమిళంలో పలు సీరియళ్లలో నటించిన అదితి అలియాస్ అథిరా సంతోష్ ఆత్మహత్యాయత్నం చేశారు. ఆమె ప్రస్తుతం నెదునల్వాడై అనే తమిళ సినిమా ద్వారా హీరోయిన్‌గానూ ఎంట్రీ ఇవ్వనుంది. ఆ సినిమాకు సెల్వకన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి అథిరా సెల్వకన్నన్ నుంచి వేధింపులు ఎదుర్కోనేదట. పదేపదే తనను ప్రేమిస్తున్నానంటూ వెంటపడేవాడని, ప్రేమను నిరాకరిస్తే బెదిరించేవాడని తెలిపింది. అతడి ప్రేమను తిరస్కరించినప్పటి నుంచి వేధింపులు మరింత ఎక్కువయ్యాయని..ఓసారి తనను గదిలో కూడా నిర్భంధించాడని..ఎలాగోలా తప్పించుకుని కేరళలోని తన ఇంటికి వెళ్లిపోయానని చెప్పింది. తాను నడిగర్ సంఘంలో సభ్యురాలినికానందున తన ఫిర్యాదును ఆ సంఘం తిరస్కరించిందని..అయితే కొద్ది రోజుల క్రితం తాను ఓ షూటింగ్ నిమిత్తం చెన్నైకి వచ్చానని..ఆ సమయంలో సెల్వకన్నన్ అక్కడికి వచ్చి తనను శారీరకంగా, మానసికంగా వేధించాడని..పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానని బెదిరించాడని అందుకే తాను ఆత్మహత్యకు యత్నించానని అథిరా మీడియా ముందు తన గోడు వెల్లబోసుకుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



