దీనస్థితిలో పోసాని..చంపేసే వాళ్ళం
on Oct 5, 2024
రచయితగా తన కెరీర్ ని ప్రారంభించి నటుడిగా,దర్శకుడిగా,నిర్మాతగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వ్యక్తి పోసాని కృష్ణ మురళి(posani krishna murali)తెలుగు చిత్రసీమకి చెందిన అందరి అగ్ర హీరోలతోనూ సినిమాలు చేసిన పోసాని పొలిటికల్ గా కూడా ప్రజలకి సేవ చేయడం కోసం జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.
అప్పట్నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(chandrababu naidu)ని, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(pawan kalyan)ని వ్యక్తిగతంగా నానా బూతులు తిట్టాడు.అప్పట్లో ఆ వ్యాఖ్యలు చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. లేటెస్ట్ గా ఒక ప్రముఖ ఛానల్ లో డిబేట్ ఒకటి జరిగింది. అందులో తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక దళిత నాయకుడు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ని తిట్టినట్టు పోసాని కనుక మా వాళ్ళల్లో ఎవరినైనా తిట్టి ఉంటే పోసానిని చంపేసి ఉండేవాళ్ళం అని చెప్పుకొచ్చాడు
ఈ విషయంపై పోసాని తాజాగా ఒక వీడియో రిలీజ్ చేసాడు.అందులో వెక్కివెక్కి ఏడుస్తూనే సదరు దళిత నాయకుడు చేసిన వ్యాఖ్యలని టెలికాస్ట్ చేసిన ఛానెల్ అధినేత, చర్చలో పాల్గొన్న యాంకర్ ని తన పాత స్టైల్లోనే అనరాని మాటలు అన్నాడు. దీంతో కూటమి ప్రభుత్వం పోసాని మీద చర్యలు తీసుకుంటే పోసాని పరిస్థితి ఎలా ఉంటుందో అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read