Home

»

Latest News

Pooja Hegde: పూజాహెగ్డే అందాల అస్త్రం.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్ 

May 13, 2026


బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde)ఎంత పని చేసింది. సోషల్ మీడియాలో ఎంతో  యాక్టివ్‌గా ఉంటు  గ్లామరస్ ఫోటోలు, సినిమా అప్‌డేట్స్‌తో నిరంతరం అభిమానులను పలకరిస్తూనే ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే నిత్య దిన చర్య కూడా. ఆ దిన చర్యలో భాగంగానే తాజాగా సోషల్ మీడియాలో కొన్ని పిక్స్ షేర్ చేసింది. ఇప్పుడు ఈ పిక్స్ నెటిజన్స్ లో చీలికని తెచ్చాయి. కొంతమంది ఆమె అందాన్ని పొగుడుతుంటే, మరికొందరు  ట్రోల్ చేస్తున్నారు.


సాధారణంగా హీరోయిన్లు అవకాశాల వేటలో భాగంగా ఫోటోషూట్స్ చేయడం సహజం. అయితే పూజా హెగ్డే షేర్ చేసిన తాజా పిక్స్ మరీ బోల్డ్‌గా ఉన్నాయి. దీంతో సినిమాల్లో  అవకాశాల కోసమే ఇంతలా గ్లామర్ ప్రదర్శించాలా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. గతంలో కూడా సౌత్ సినిమాల్లో నడుము అందాల ప్రదర్శనపై ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె చేస్తున్న ఫోటోషూట్స్ ఆ వ్యాఖ్యలకు విరుద్ధంగా ఉన్నాయంటూ పాత విషయాలని గుర్తు చేస్తు నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.


Also read: బాలకృష్ణ, ఎన్టీఆర్ మల్టీస్టారర్!.. ఈ సబ్జెట్ అయితే సూపర్ అంట

ట్రోల్స్ పక్కన పెడితే, పూజాహెగ్డే చేతిలో ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్ లేవు. జూన్ 5 న వరుణ్ ధావన్ తో కలిసి హయ్ జవానీ తోష్ ఇష్క్ హోనా హై తో థియేటర్స్ లోకి వస్తుంది. విజయ్ తో చేసిన జననాయగన్ త్వరలోనే రిలీజ్ కి సిద్దమవుతుంది.   

 


 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com