బుట్టబొమ్మ క్రేజ్.. ఇన్‌స్టాగ్రామ్‌లో మరో మైల్స్టోన్!
on Oct 24, 2020
జూలై నెలలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో 11 మిలియన్ ఫాలోయర్స్ మార్క్‌ను చేరుకున్న సందర్భంగా పూజా హెగ్డే చేసుకున్న సెలబ్రేషన్స్ ఇంకా మన మనసుల నుంచి చెరిగిపోలేదు. పట్టుమని మూడు నెలలు గడిచాయో లేదో, ఆ న్యూస్ పాతబడిపోయింది. ఇప్పుడు ఈ 'బుట్టబొమ్మ' 12 మిలియన్ ఫాలోయర్ల మార్క్‌ను చేరుకుంది. ఆమె సాధించిన అ ఫీట్‌తో ఫ్యాన్స్ ఆనందానికి అడ్డు లేదు.
11 మిలియన్ల మంది ఫాలోయర్లను అందుకున్నప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పూజ, "ఈ సంవత్సరం నా కాళ్ల గురించి (మీకు తెలిసినట్లయితే) నా పోస్ట్ కోసం వాటిని ఉపయోగించడం మంచిదని నేను డిసైడ్ చేసుకున్నాను. ఎప్పట్లాగే నేను పాజిటివిటీని, లవ్‌ను వ్యాప్తి చేయడాన్ని కొనసాగిస్తాను. నా సరదా, సిల్లీ పోస్టులతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంటాను. మీ ప్రేమ, షరతుల్లేని మీ సపోర్ట్ నన్ను డాన్స్ చేయిస్తుంది, బలాన్నుంచి బలానికి నడిపిస్తుంది, నా హృదయంలో ప్రేమను నింపుతుంది. Loads of love from Buttabomma herself” (sic). అని రాసుకొచ్చింది. ఇప్పుడు 12 మిలియన్ల మంది ఫాలోయర్లను పొందడంతో సెలబ్రేషన్స్‌ను ఎలా జరుపుకుంటోదనని ఫ్యాన్స్ ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు.
సినిమాల విషయానికి వస్తే, త్వరలో అఖిల్ అక్కినేని సరసన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' సినిమాలో పూజ కనిపించనున్నది. 'రాధే శ్యామ్' సినిమా కోసం ప్రస్తుతం ఇటలీలోని అందమైన ప్రదేశాల్లో ప్రభాస్‌తో రొమాన్స్ చేస్తూ, ఆడి పాడుతోంది.
Also Read