బోయపాటి మెగా ఆశలు... బాలకృష్ణ తర్వాత?
on Oct 24, 2020
'సరైనోడు' సక్సెస్ తరువాత మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా గీతా ఆర్ట్స్ సంస్థలో సినిమా చేసే అవకాశం దర్శకుడు బోయపాటి శ్రీనుకి వచ్చింది. ఎందుకనో ఆ ప్రాజెక్ట్ తరువాత మెటీరియలైజ్ కాలేదు. చిరు తనయుడు రామ్ చరణ్ హీరోగా 'వినయ విధేయ రామ' చేశాడు బోయపాటి. అది ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. అప్పట్లో మెగా ఫ్యామిలీతో బోయపాటికి ఏవో విబేధాలు వచ్చాయని గుసగుసలు వినిపించాయి. అయితే, అటువంటిది ఏమీ లేదని... చిరంజీవితో సినిమా చేయడానికి బోయపాటి సిద్ధం అవుతున్నారని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్.
ప్రస్తుతం నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్లు 'సింహ', 'లెజెండ్' సినిమాల తరవాత హీరో, దర్శకుడి కాంబినేషన్లో ముచ్చటగా తెరకెక్కుతున్న మూడో చిత్రమిది. దీని తరువాత చిరంజీవి హీరోగా బోయపాటి సినిమా చేయాలని అనుకుంటున్నారట. ఆల్రెడీ హీరోని కలిసి స్టోరీ లైన్ వినిపించారని, లాక్ డౌన్ లో స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేశారని టాక్. త్వరలో చిరంజీవిని కలిసి కథ వినిపిస్తారట.
Also Read