పవన్‌కు భర్తగా పదికి నాలుగు మార్కులే వేస్తా..!
on Mar 6, 2017
విడిపోయారన్న మాటే కాని పవన్‌కళ్యాణ్, రేణూదేశాయ్‌లు ఇప్పటీకి ఒకరిపై ఒకరు అభిమానాన్ని చాటుకుంటూనే ఉన్నారు. పవన్‌కు బర్త్‌డే విషెస్, ఆయన నటించిన సినిమాలు రిలీజ్ అయ్యే టైమ్‌లో ఆల్ ద బెస్ట్‌లు చెబుతూ తన ప్రేమను చాటుకుంటున్నారు రేణూ..పవన్ కూడా ఎప్పటికప్పుడు తన మాజీ భార్య క్షేమసమాచారాల గురించి ఆరా తీస్తూ ఉంటారు. అన్ని విషయాల్లో పవన్ సూపర్ అంటున్న రేణూ ఒక విషయంలో మాత్రం ఆయన యావరేజ్ అంటోంది.
ఉమెన్స్ డే సందర్భంగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు రేణూ. అందులో భాగంగా భర్తగా, తండ్రిగా, నటుడిగా, రాజకీయ నటుడిగా పది మార్కులకు పవన్ కళ్యాణ్‌కు ఎన్ని మార్కులు వేస్తారు..? అనే ప్రశ్నకు..రేణూ స్పందిస్తూ తండ్రిగా పదికి వంద మార్కులు, నటుడిగా, రాజకీయ నాయకుడిగా పదికి పది మార్కులు వేస్తానని కాని..భర్తగా పవన్ యావరేజ్ స్టూడెంట్ అని పదికి నాలుగు మార్కుల కంటే ఎక్కువ వేయలేనని తెలిపింది. పవన్ అంటే పడిచచ్చిపోయే రేణూ ఇలా ఎందుకు చెప్పిందా అని అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు.