పవన్ టైటిల్‌తో విష్ణు సినిమా..!
on Aug 9, 2016
'సేనాపతి' అనే టైటిల్ ని కొన్నాళ్ల నుంచి పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మంత్రంలా జపిస్తున్నారు. పవన్ - డాలీల సినిమాకి ఈ టైటిల్ పెడతారని అందరూ ఊహించారు. కొంతమంది ఔత్సాహిక అభిమానులు 'సేనాపతి' అనే పేరుతో పోస్టర్లు డిజైన్ చేసి బయటకు వదిలారు. ఆ టైటిల్ పవన్‌కి బాగా సూటైందని అభిమానులు మురిసిపోయారు కూడా. అయితే ఇప్పుడు ఈ టైటిల్‌తో ఓ సినిమా మొదలవుతుంది. కానీ హీరో పవన్ కల్యాణ్ కాదు.. మంచు విష్ణు. ఆయన కథానాయకుడిగా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై ఓ సినిమా రూపుదిద్దుకొంటోంది. ఈ చిత్రానికి 'సేనాపతి' అనే టైటిల్ ఖరారు చేశారు. ఇందులో మంచు మోహన్ బాబు ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. మోహన్ బాబు - విష్ణు తండ్రీ కొడుకులుగా నటించబోతున్నట్టు టాక్. మోహన్‌బాబు దగ్గర నమ్మిన బంటులా.. విష్ణు పాత్ర ఉంటుందట. అందుకే ఈ సినిమాకి ఆ పేరు ఖాయం చేశారని చెబుతున్నారు. త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కనుంది.