తప్పంతా అల్లు అర్జున్‌దే.. పవన్‌కళ్యాణ్!
on Dec 30, 2024
డిసెంబర్ 4న ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన అందరికీ తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించి ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకు ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీయం పవన్‌కళ్యాణ్ స్పందించలేదు. దీని గురించి ఆయన తొలిసారి స్పందిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
‘సంధ్య థియేటర్ ఘటనకు అల్లు అర్జున్‌నే బాధ్యుడ్ని చేశారు. అది కరెక్ట్ కాదు. ఇలాంటి విషయాల్లో యూనిట్‌లోని అందరూ ఒక టీమ్‌లా ఉండాలి. అలా కాకుండా గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చారు. రేవంత్‌రెడ్డిగారు సినిమా ఇండస్ట్రీకి మంచి తోడ్పాటు అందిస్తున్నారు. ఆయన చాలా డైనమిక్ లీడర్. ఆయన కాబట్టే ఒక హీరోని అరెస్ట్ చేయించారు. చట్టం దృష్టిలో ఎవరైనా ఒకటే. ఇక్కడ వైసీపీ ప్రభుత్వంలా రేవంత్ ప్రభుత్వం లేదు. బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. అందువల్లే పుష్ప2, సలార్ వంటి చిత్రాలకి అంతటి భారీ కలెక్షన్లు వచ్చాయి. సినిమాపై భారీ అంచనాలు ఉంటే ఫ్యాన్స్ ఎక్కువగా వస్తారు. మొదటిరోజు సినిమా చూసేందుకు ఈమధ్య నేను వెళ్లడం లేదు. మూడు సినిమాలకు మాత్రమే అలా వెళ్లాను. ఆ తర్వాత ఆగిపోయాను. థియేటర్ దగ్గర పరిస్థితి గురించి అల్లు అర్జున్ స్టాఫ్ అతనికి చెప్పి ఉండాల్సింది. ఆ తర్వాతి రోజైనా బాధిత కుటుంబాన్ని పరామర్శించి మేం మీకు అండగా ఉన్నాం అని చెప్పాలి. మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయింది అని చెబితే ఎంతో గౌరవంగా ఉండేది. కానీ, అది జరగలేదు. అల్లు అర్జున్ వెళ్ళకపోయినా నిర్మాతలైనా, మరెవరో ఒకరు వెళ్లి ఉండాల్సింది. ఈ విషయంలో అడ్వకేట్లు ఏర్పాట్లు చేస్తే బాగుండేది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారీ బడ్జెట్‌తో సినిమాలు తీసినపుడు ధరలు పెంచడం అనేది అనివార్యం. ఇక ప్రేక్షకుల గురించి చెప్పాలంటే సినిమా హీరోల పట్ల వారు ప్రేమ, ఆదరణ చూపిస్తారు. హీరో వస్తున్నారంటే అభిమానుల ఎగబడడం సహజం. అల్లు అర్జున్ విషయంలో ముందు, వెనక ఏం జరిగిందో నాకు తెలీదు. ఇలాంటి ఘటనల్లో నేను పోలీసులను తప్పుపట్టను. ఎందుకంటే వారు మొదట ఆలోచించేది ప్రజల భద్రత గురించే.
మన సినిమాల ద్వారా మన సంస్కృతిని, మన కళలను ప్రజలకు చూపించే అవకాశం ఉంది. ఈరోజుల్లో ఊహ తెలిసిన దగ్గర నుంచే పిల్లలు టీవీలు చూస్తున్నారు. కొత్త వీడియోలు వస్తే ఫోన్లలో ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాల ద్వారా ఎవరికి ఏది అందించాలి అనే ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. హీరోలు మొదటిరోజు సినిమా థియేటర్‌కి వెళ్ళడం అనేది సర్వసాధారణం. అయితే నేను అది ఎప్పుడో మానేశాను. చిరంజీవిగారు ముసుగు వేసుకొని ఒక్కరే థియేటర్‌కి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అలాగే నేను కూడా వెళ్లాను. ఈ విషయంలో అల్లు అర్జున్‌కి అతని స్టాఫ్ సలహా ఇచ్చి ఉండాల్సింది. థియేటర్ ఘటనలో రేవతి మరణం నన్ను కలచివేసింది. థియేటర్ ముందు హీరో అభిమానులకు అభివాదం చేశాడు. అలా చేయడం హీరోకి అవసరం. అలా చేయకపోతే అతనిపై ప్రేక్షకుల్లో మరో అభిప్రాయం కలిగే అవకాశం ఉంది. అతనికి పొగరు, బలుపు అంటూ చర్చ మొదలుపెడతారు. ఈ ఘటన వల్ల ఒక ప్రాణం పోయిందనే బాధ అర్జున్‌లోనూ ఉంటుంది. అతన్ని అరెస్ట్ చేయించడంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆసక్తి కనబరిచారని, ముఖ్యమంత్రి పేరు చెప్పకపోవడం వల్లే ఇలా జరిగిందని అంటున్నారు. కానీ, అది కరెక్ట్ అని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే రేవంత్‌రెడ్డిగారు వీటన్నింటినీ మించిన నాయకుడు’ అంటూ సంధ్య థియేటర్ ఘటనపై, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై వ్యాఖ్యానించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్.
Also Read