మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ ట్వీట్
on Dec 30, 2024
మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)చాలా సందర్భాల్లో 'నేను సినిమా రంగంలో ఒక పొజిషన్ లో ఉన్నానంటే అందుకు కారణం మా నాన్న వెంకట్రావు(venkata rao)గారి ప్రోత్సాహమే కారణమని చెప్పిన విషయం తెలిసిందే.సినిమాల్లోకి వెళ్తానని, యాక్టింగ్ కి సంబంధించిన కోచింగ్ ని తీసుకుంటానని చెప్పినపుడు ఎక్కడ విసుక్కోకుండా నన్ను ఎంకరేజ్ చేసారని, సినిమాల్లో చేస్తున్నప్పుడు కూడా పలు సూచనలు చేసాడని కూడా చిరు చెప్తుంటాడు.
ఇక ఈ రోజు చిరు 'ఎక్స్' వేదికగా తన తండ్రిని మరో సారి గుర్తుచేసుకున్నారు.'జన్మనిచ్చిన ఆ మహనీయుడ్ని ఆయన స్వర్గస్తులైన ఈ రోజున స్మరించుకుంటూ అని ట్వీట్ చేసాడు.ఒక ఫోటో కూడా షేర్ చెయ్యగా అందులో వెంకట్రావు ఫోటో వద్ద చిరంజీవి,సురేఖ తో పాటు అంజనాదేవి, నాగబాబు(nagababu)అయన సతీమణి కూడా ఉన్నారు.ఈ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక చిరు తండ్రి వెంకట్రారావు పోలీసు ఆఫీసర్ గా కొన్ని సినిమాల్లో నటించారు. నిజ జీవితంలోను పోలీస్ ఆఫీసర్ గా పని చేసిన ఆయన 2007 డిసెంబర్ 24 న చనిపోవడం జరిగింది.
Also Read