
మంత్ స్టార్టింగ్ లోకి వచ్చేసాం, ఖర్చులు ఉంటాయి అని డల్ అవ్వాల్సిన అవసరం లేదు. మై హునా అంటూ ఓటిటి వేదికగా పలు క్రేజీ చిత్రాలు, సిరీస్ లు మీలో జోష్ తీసుకురావడానికి కోటి ఆశలతో పకడ్బందీగా ముస్తాబు అయ్యి కూర్చుకున్నాయి . మరి ఆ లిస్ట్ ఏంటో చూసేయండి.
ఈ వారం ఓటీటీ రేసులో అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్న ప్రధాన చిత్రం అక్కినేని అఖిల్ రీసెంట్ హిట్ మూవీ 'లెనిన్'. జూలై 10న థియేటర్లలోకి వచ్చిన ఈ గ్రామీణ యాక్షన్ డ్రామా, ఇప్పుడు ఆగస్టు 7 నుండి ZEE5 ఓటీటీ వేదికగా డిజిటల్ స్ట్రీమింగ్‌కి రాబోతోంది. మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అఖిల్ సరికొత్త రూరల్ మాస్ లుక్‌లో కనిపించాడు. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా గ్రామీణ నేపథ్యం, రాజకీయాలు మరియు మహాభారత, రామాయణ ఛాయలతో రూపొందిన ఈ కథ ప్రేక్షకులలో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. అఖిల్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటించగా, నటుడు శివాజీ కీలక పాత్రలో కనిపించారు. లెనిన్ మాత్రమే కాకుండా, వివిధ భాషల నుంచి వస్తున్న పలు క్రేజీ డబ్బింగ్ చిత్రాలు మరియు సీక్వెల్ సిరీస్‌లు కూడా డిజిటల్ లవర్స్‌ను ఆకట్టుకోనున్నాయి. తమిళం నుంచి విశేష ఆదరణ పొందిన 'హృదయం మురళి' (ఇదయం మురళి), 'వంద దేవుళ్లు' (నూరు సామి), మరియు 'మై వాసప్ ఆవుంగా' వంటి విభిన్న చిత్రాలు ప్రధాన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సందడి చేయనున్నాయి. దీనితో పాటు సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్ ఎలిమెంట్స్‌తో కూడిన 'ఆపరేషన్ సఫేద్ సాగర్', క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'వదంది 2' వంటి భారీ వెబ్ సిరీస్‌లు కూడా స్ట్రీమింగ్ కావడానికి సన్నాహాలు చేసుకున్నాయి.
Also read: ఆ గుడిలో ప్రముఖ హీరోయిన్ పూజలు.. పైత్యం అంటూ విమర్శిస్తున్న నెటిజెన్స్
మరోవైపు థియేటర్లలో కూడా పలు ఆసక్తికరమైన చిత్రాలు విడుదలవుతుండటం విశేషం. యంగ్ హీరో వరుణ్ తేజ్ నటించిన కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రం 'కొరియన్ కనకరాజు' థియేటర్లలో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉంది. అలాగే ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ నటుడిగా పరిచయమవుతున్న 'డిసి', మరియు మాధవన్ నటించిన 'జీడీ నాయుడు' బయోపిక్ వంటి విభిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. వీటికి తోడు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న ఆయన బ్లాక్‌బస్టర్ హిట్ 'దూకుడు' భారీ ఎత్తున రీ-రిలీజ్ కాబోతుండటం అభిమానుల్లో పండుగ వాతావరణాన్ని నింపుతోంది.ఇలా సుమారు ఇరవై మూడుకి పైగా సినిమాలు, సిరీస్‌లు మీ కోసమే వస్తున్నాయి. ఆగస్టు 3 నుంచి ఆగస్టు 9 వరకు ప్రసారమయ్యే ఈ వినోదాల లైనప్‌లో యాక్షన్, థ్రిల్లర్, కాన్సెప్ట్ డ్రామా, హారర్ మరియు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు చోటుచేసుకున్నాయి.కాబట్టి సినీ కిక్ ప్రాప్తిరస్తు.
Lenin, Korean Kanakaraju, akhil, varun, lokesh kanagaraj






