Home

»

Latest News

ధనుష్ పొలిటికల్ ఎంట్రీ? అరుణాచలంలో రజినీకాంత్ మనవళ్లతో ప్రత్యేక పూజలు

Aug 3, 2026 12:06PM

 


స్టార్ హీరో ధనుష్(Dhanush)పొలిటికల్ ఎంట్రీ ఖాయమనే వార్తలు రోజు రోజుకి హీట్ రాజేస్తున్నాయి. ఆ విషయంపై ధనుష్ స్పందించకపోయినా ధనుష్ వ్యవహార శైలి మాత్రం అందుకు తగట్టుగానే ఉంది. ఈ క్రమంలోనే రీసెంట్ గా జరిగిన బర్త్ డే వేడుకలే ఒక ఉదాహరణ. ధనుష్, ఇటీవల తమిళనాడులోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయాన్ని సందర్శించాడు. ధనుష్ తో పాటు తన ఇద్దరు కుమారులు యాత్ర, లింగ కూడా పాల్గొనడంతో సామాజిక మాధ్యమాల్లో అందుకు  సంబంధించిన వీడియోలు, ఫోటోలు క్షణాల్లో వైరల్‌గా మారాయి. 


 సాంప్రదాయ పట్టు వస్త్రాలు ధరించి  ఉదయాన్నే ఆలయానికి చేరుకున్న ధనుష్ అరుణాచలేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పవిత్రమైన గోపూజలో పాల్గొన్నాడు . . కి ఆలయ అర్చకులు ప్రత్యేక మర్యాదలతో స్వాగతం పలికి, రుద్రాక్ష మాలని బహుకరించా రు.   అయితే ఈ ఆలయ సందర్శన కేవలం ఒక దైవదర్శనానికే పరిమితం కాలేదు. ప్రస్తుతం తమిళనాడు వ్యాప్తంగా ధనుష్ రాజకీయ అరంగేట్రంపై తీవ్రస్థాయిలో ఊహాగానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల కోలీవుడ్‌ స్టార్ హీరో విజయ్ తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీని స్థాపించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో ధనుష్ కూడా రాజకీయాలపై దృష్టి సారిస్తున్నారా అనే సందేహాలు సినీ, రాజకీయ వర్గాల్లో మొదలయ్యాయి. ఆయన ముందస్తు రాజకీయ అడుగుల కోసమే ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారా అనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. తమిళనాడు రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో, ధనుష్ వేస్తున్న ప్రతి అడుగు విశ్లేషకుల దృష్టిని ఆకర్షిస్తోంది.

Also read: ఈ వారం ఓటిటి, థియేటర్స్ లో సినిమాల జాతర.. కిక్ ప్రాప్తిరస్తు  

 ధనుష్ ప్రస్తుతం తన 77 వ చిత్రం 'ఓం' తో బిజీగా ఉన్నాడు. శరవేంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. నిరంతరం షూటింగ్‌లతో  బిజీగా ఉండే ధనుష్ శివ భక్తుడనే విషయం తెలిసిందే.

Dhanush, OM, Rajinikanth, Tiruvannamalai

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com