ఓ భామ అయ్యో రామ మూవీ రివ్యూ
on Jul 11, 2025

సినిమా పేరు: ఓ భామ అయ్యో రామ
తారాగణం: సుహాస్, మాళవిక మనోజ్,అనిత, బబ్లూ పృథ్వీ, అలీ, ప్రభాస్ శ్రీను, రవీంద్ర విజయ్, సాత్విక్ ఆనంద్ తదితరులు
సంగీతం: రాధాన్
ఫొటోగ్రఫీ : మణికంధన్
ఎడిటర్: భవిన్ ఎమ్ షా
రచన, దర్శకత్వం: రామ్ గోదాల
నిర్మాత:హరీష్ నల్లా
బ్యానర్: వి ఆర్ట్స్,
విడుదల తేదీ: జూలై 11 ,2025
సుహాస్(Suhas) హీరోగా తమిళ 'జో'మూవీతో ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్న 'మాళవిక మనోజ్'(Malavika Manoj) హీరోయిన్ గా నటించిన చిత్రం 'ఓ భామ అయ్యో రామ' (Oh Bhama Ayyo Rama). ప్రచార చిత్రాలతో మంచి బజ్ ని క్రియేట్ చేసుకోగా, ఈ రోజు థియేటర్స్ లోకి అడుగుపెట్టింది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ
రామ్ (సుహాస్) తన పదేళ్ల వయసులోనే తల్లి మీనాక్షి(అనిత) చనిపోవడంతో ఆమె జ్ఞాపకాలతో బతుకుతుంటాడు. సినిమా అంటే ఇష్టం ఉండదు. కానీ స్క్రీన్ పై సినిమా చూడకుండా, థియేటర్ ఆవరణలోనే సినిమా తాలూకు మాటలు వింటు, సినిమా హిట్టా, ప్లాపా అని చెప్పడంలో మంచి నేర్పరి. ఫారెన్ లో ఉన్నత చదువు కోసం వెళ్లాలనే లక్ష్యంతో ఉంటాడు. కానీ తన చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటనని గుర్తు చేసుకొని భయపడుతుంటాడు. సత్యభామ అలియాస్ సత్య(మాళవిక మనోజ్) అనే మిలినియర్(బబ్లూ పృథ్వీ) కూతరు రామ్ జీవితంలోకి వస్తుంది. ప్రపంచంలో ఉన్న అమ్మాయిలందరి కంటే తనే అందగత్తెని అనే కాన్ఫిడెన్స్ తో ఉంటు, చాలా సరదాగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటుంది. రామ్, భామ ఒకరికొకరు ప్రేమించుకుంటారు. రామ్ పెద్ద సినిమా దర్శకుడు అవ్వాలని అసిస్టెంట్ డైరెక్టర్ గా భామ జాయిన్ చేస్తుంది. సినిమా అంటే ఇష్టం లేని రామ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అవుతాడు. రామ్ జీవితంలోకి సత్య ఎందుకు వచ్చింది? ఫారెన్ వెళ్లే వ్యక్తిని ఎందుకు అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ చేసింది? రామ్ చిన్నప్పటి జీవితానికి భామకి ఏమైనా సంబంధం ఉందా? రామ్ తల్లి మీనాక్షి ఎవరు? ఆమె ఏ విధంగా చనిపోయింది? సినిమా అంటే రామ్ కి ఇష్టం లేకపోవడానికి కారణం ఏంటి? ఏ విషయాన్నీ గుర్తు చేసుకొని రామ్ పెద్దయ్యాక కూడా భయపడుతున్నాడు? అసలు రామ్ జీవితంలోకి భామ ఎందుకు వచ్చింది? చివరకి ఆ ఇద్దరు ఒక్కటయ్యారా లేదా అనేదే ఈ చిత్ర కథ.
ఎనాలసిస్
ఖచ్చితంగా 'ఓ భామ అయ్యో రామ' మంచి కథతోనే తెరకెక్కింది. ఆడవాళ్ళ గొప్పతనం గురించి చాలా చక్కగా చెప్పారు. కానీ కథనంలోని లోపల వల్ల అంతగా కనెక్ట్ అవ్వదు. ఎన్నో సినిమాల ఇన్ స్పిరేషన్ తో అక్కర్లేని సన్నివేశాలు పెట్టి మంచి కథని చేరువ కాకుండా చేసారు. ఫస్ట్ హాఫ్ ఓపెన్ చేస్తే రామ్ ఇంట్రడక్షన్ తో పాటు తన ఫ్లాష్ బ్యాక్ చెప్పడం, ఆ తర్వాత భామ ఇంట్రడక్షన్, ఆమె క్యారక్టర్ ని మలిచిన తీరు ఇవన్నీ మూవీపై మంచి ఆసక్తిని కలిగించాయి. కానీ ఆ తర్వాత నెమ్మది నెమ్మది గా రామ్ క్యారక్టర్ ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో తెలియదు. ఈ విషయమే సినిమాకి ప్రధాన లోపం. భామ క్యారక్టరయిజేషన్ మాత్రం చాలా బాగుంది. రామ్ కి సంబంధించిన గతం భామకి ఏమైనా తెలుసా అనే ఆసక్తిని కలిగించింది. కాకపోతే ఆ ఇద్దరి మధ్య వచ్చిన సన్నివేశాలు మాత్రం ఆకట్టుకోలేదు. రామ్ అండ్ ఫ్రెండ్స్, రామ్ మేనమామ అలీ మధ్య వచ్చిన సన్నివేశాలు కూడా ఆకట్టుకొని విధంగా ఉన్నాయి. రామ్ తో భామ సినిమా కథలు చెప్పే సన్నివేశాలు కొత్తగా ఉన్నా కామెడీ వర్క్ అవుట్ కాలేదు. డైలాగులు కూడా ప్రధాన మైనస్ గా నిలిచాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. సెకండ్ హాఫ్ లో చూసుకుంటే రామ్ తల్లి మీనాక్షి ఫ్లాష్ బ్యాగ్ బాగుంది. ఎంతలా అంటే సినిమా మొత్తంపై ఆ ఎపిసోడ్ హైలెట్ అని చెప్పవచ్చు. క్లైమాక్స్ విషయంలో మరింత శ్రద్ధ చూపించాల్సింది.
నటీ నటులు సాంకేతిక నిపుణుల పని తీరు
సుహాస్ ఎప్పటిలాగానే రామ్ క్యారక్టర్ లో కథకి సూటయ్యేలా నటించాడు. తన గత చిత్రాల్లో లేని విధంగా డాన్స్ లో మెప్పించాడు. భామ క్యారక్టర్ లో తమిళ నటి 'మాళవిక మనోజ్' ఒక రేంజ్ లో నటించింది. ఎంతలా అంటే తను స్క్రీన్ పై కనపడుతున్నంత సేపు హుషారుని తీసుకొచ్చింది. సీన్స్ ఎలివేషన్ బాగోలేకపోయినా, అచ్చ తెలుగు అమ్మాయిగా నటనతో, అందంతో మూవీకి నిండు తనాన్ని తీసుకొచ్చింది. రామ్ తల్లిగా చేసిన నువ్వు నేను ఫేమ్ హీరోయిన్ అనిత, ఆమె భర్త క్యారక్టర్ లో చేసిన రవీంద్ర విజయ్, అలీ, భామ తండ్రిగా చేసిన బబ్లూ పృథ్వీ తమ పాత్ర పరిధి మేరకు నటించారు. ఇక దర్శకుడు రామ్ గోదాల(Ram Godala)డైరెక్టర్ గా పర్వాలేదని అనిపించినా, రచయితగా ఫెయిల్ అయ్యాడు. మంచి కథ కి మంచి స్క్రీన్ ప్లే ని సమకూర్చులేకపోయాడు. నిర్మాణ విలువలు మాత్రం ఎక్స్ లెంట్ గా ఉన్నాయి, మ్యూజిక్, ఆర్ .ఆర్ ఒక మాదిరిగా ఉన్నా ఫొటోగ్రఫీ బాగుంది.
ఫైనల్ గా చెప్పాలంటే... మంచి కథని ఎంచుకున్నారు. కానీ స్క్రీన్ ప్లే విషయంలో ఇంకొంచం జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. హీరోయిన్ మాత్రం తన పెర్ ఫార్మెన్స్, అందంతో చివరిదాకా థియేటర్ లో కుర్చోపెట్టింది.
రేటింగ్ 2.5/5
- అరుణాచలం
Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. We would encourage viewers' discretion before reacting to them.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



