Home

»

Latest News

ఎన్టీఆర్ విశ్వరూపం.. మళ్లీ అలాంటి స్టెప్పుల కోసం ఫ్యాన్స్ వెయిటింగ్!

Nov 21, 2026 1:11PM


మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్.. కాలు కదిపి డాన్స్ చేస్తే రబ్బరు కూడా అంత గబాగబా వంగదు కదా అనే విధంగా డాన్స్ చేస్తాడు. ఎంతటి  కష్టమైన స్టెప్పునైనా అత్యంత సునాయాసంగా, గ్రేస్‌తో వేయడం ప్రత్యేకత. అందుకే అభిమానులు కింగ్ ఆఫ్ డాన్స్ అంటారు. డాన్స్ చెయ్యడమే కాదు స్టెప్స్ ని స్టైల్ గా ప్రదర్శించడంలో కూడా ఎన్టీఆర్ సిద్ధహస్తుడు. 


ఎన్టీఆర్ కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన డ్యాన్స్ నంబర్లు ఉన్నప్పటికీ, 2015లో పూరి జగన్నాధ్ తో చేసిన 'టెంపర్' లోని టైటిల్ సాంగ్ 'నీ తాత టెంపర్.. నీ అయ్య టెంపర్' మాత్రం అభిమానుల గుండెల్లో ఎప్పటికీ చెరగని ముద్ర వేసింది. అనూప్ రూబెన్స్ అందించిన మాస్ బీట్‌కు, భాస్కరభట్ల రాసిన పవర్‌ఫుల్ లిరిక్స్ తోడవడంతో ఈ పాట బాక్సాఫీస్ వద్ద ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ముఖ్యంగా ఈ పాటలో ఎన్టీఆర్ వేసిన అదిరిపోయే స్టెప్పులు, ఆయన బాడీ లాంగ్వేజ్ మరియు స్టైలిష్ లుక్ థియేటర్లలో అభిమానులని పూనకాలతో ఊగిపోయేలా చేశాయి. రిలీజ్ రోజు గుంటూరులోని చాలా థియేటర్స్ లో అయితే రెండో సారి ప్లే చేసే దాకా ఫ్యాన్స్ ఊరుకోలేదు.నందమూరి వంశం పౌరుషాన్ని, యాటిట్యూడ్‌ని ప్రతిబింబించేలా సాగే ఈ 4 నిమిషాల 6 సెకన్ల పాటలో ఎన్టీఆర్ ఎనర్జీ లెవల్స్ పీక్స్‌లో ఉంటాయి. సిక్స్ ప్యాక్ బాడీతో, సరికొత్త హెయిర్ స్టైల్‌తో కాజల్ అగర్వాల్‌తో కలిసి  చేసిన డ్యాన్స్ మూమెంట్స్ ఇప్పటికీ అభిమానులకి ఫేవరెట్. ఎన్టీఆర్ కెరీర్‌లోనే బెస్ట్ డ్యాన్స్ మూమెంట్స్ మరియు స్టైల్ ఉన్న పాటగా 'టెంపర్' టైటిల్ సాంగ్ నిలిచిపోయింది.

 

యూట్యూబ్‌లో ఈ ఫుల్ వీడియో సాంగ్‌కు ఇప్పటివరకు 38 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం ఈ పాట క్రేజ్ ఏ స్థాయిలో ఉందో స్పష్టం చేస్తోంది.  పాట మొదలైనప్పటి నుంచి చివరి వరకు ఎన్టీఆర్ వేసే ప్రతి ఫుట్‌వర్క్, ఆయన ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. కేవలం మాస్ ఆడియన్స్ మాత్రమే కాకుండా, క్లాస్ ప్రేక్షకులు కూడా ఈ పాటలోని ఎన్టీఆర్ గ్రేస్‌కు ఫిదా అయిపోయారు.

ఇది కూడా చదవండి: పీపీ డుమ్ డుమ్: ఆ స్టార్ హీరోతో సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా పెళ్లి!

ఫ్యాన్స్ అయితే ఈ సాంగ్ చూసి కానీ నిద్రలోకి జారుకోరు. ఇప్పటికీ ఏదైనా ఫంక్షన్ జరిగినా, కాలేజీ ఈవెంట్స్ అయినా, డ్యాన్స్ రియాలిటీ షోలు అయినా 'నీ తాత టెంపర్' పాటకు డ్యాన్స్ చేయాల్సిందే అన్నంతగా  పాపులర్ అయింది. 

అయితే గత కొంతకాలంగా ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా మారారు. ఆయా సినిమాల్లో కథకు ప్రాధాన్యత ఉండటంతో, 'టెంపర్' రేంజ్‌లో పూర్తిస్థాయి మాస్, స్టైలిష్ డ్యాన్స్ నంబర్లు కాస్త తగ్గాయనే చెప్పాలి. దీనితో నందమూరి అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ కోరికను బయటపెడుతున్నారు. ఎన్టీఆర్ మళ్లీ 'నీ తాత టెంపర్' పాటలో మాదిరిగా హై-వోల్టేజ్ ఎనర్జీతో, స్టైలిష్ స్టెప్పులతో థియేటర్లని  షేక్ చేసే సాంగ్ చేయాలని వారు ఆశిస్తున్నారు. రాబోయే సినిమాల్లో ఎన్టీఆర్ నుంచి అలాంటి వింటేజ్ మాస్ డ్యాన్స్ ట్రీట్ రావాలని కోరుకుందాం.

 

మీకు నచ్చవచ్చు :ఆ నలుగురు తెలుగు స్టార్స్ పై సల్మాన్ వ్యాఖ్యలు వైరల్!
మీకు నచ్చవచ్చు: ఆకాశంలో ఒక తార హీరోయిన్  అసలు కథ ఇదే!

 

[Ntr, Temper, kazal, Tollywood]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com