Home

»

Latest News

నిజంగానే ఆకాశంలో ఒక తార: సాత్విక వీరవల్లి ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!

Nov 20, 2026 4:14PM

తెలుగు సినిమా ప్రేమికులంత అదృష్టవంతులు ఇంకొకరు లేరు. ఒకర్ని మించి మరొక అందగత్తె, కళ్ళతోనే తన క్యారక్టర్ తాలూకు భావజాలాన్ని ప్రదర్శిస్తూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో గిలిగింతలు రేపుతున్నారు. గిలిగింతలు రేపడమే కాదు తొలి ఆట పడటం ఆలస్యం అభిమానులుగా మారుతున్నారు. ఇప్పుడు ఆ అదృష్టం సాత్విక వీరవల్లిది అయ్యింది.


సాత్విక వీరవల్లి  అచ్చ తెలుగమ్మాయి. తండ్రిది ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణ జిల్లా. బిజినెస్ రీత్యా చెన్నై లో సెటిల్ అయ్యారు.. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే ఆమె తన కలలను నిజం చేసుకునేందుకు సినీ పరిశ్రమలోకి ప్రవేశించింది.సాధారణంగా అమెరికాలో మంచి కార్పొరేట్ ఉద్యోగం, చేతిలో రెండు ఇంజినీరింగ్ డిగ్రీలు ఉంటే జీవితంలో పూర్తిగా సెటిల్ అయిపోయామని ఎవరైనా అనుకుంటారు. 

కానీ సాత్విక వీరవల్లి ఆ సురక్షితమైన చట్రాన్ని దాటి సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. దర్శకుడు పవన్ సాధినేని తెరకెక్కించిన ఆకాశంలో ఒక తార చిత్రంలో దుల్కర్ సల్మాన్ సరసన కథానాయికగా నటిస్తూ  తెలుగు తెరకు పరిచయమయ్యారు. కార్పొరేట్ జీవితాన్ని వదిలి వెండితెర వైపు రావడం తన జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన యాదృచ్ఛికమని ఆమె పంచుకున్నారు.   అమెరికాలో పుట్టి పెరిగిన సాత్వికకు సాఫ్ట్‌వేర్, హెల్త్‌కేర్ టెక్నాలజీ రంగంలో సుమారు 4 ఏళ్ల వృత్తిపరమైన అనుభవం ఉంది. ఒరాకిల్ సెర్నర్‌లో సీనియర్ కన్సల్టెంట్ మరియు ఇంటర్‌ఆపరబిలిటీ ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేసిన ఆమె, నిజానికి పీహెచ్‌డీ లేదా ఎంబీఏ చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నారు.

 

అయితే న్యూయార్క్‌కు మారిన తర్వాత కార్పొరేట్ ఉద్యోగం చేస్తూనే కళల వైపు పయనిస్తున్న ఎంతోమందిని చూసి, తన మనసులోని లోటు మరింత పెద్దదైందని ఆమె వివరించారు. ఆ సమయంలోనే ఈ సినిమా అవకాశం రావడంతో వెనుకాడకుండా అంగీకరించారు.ఒరాకిల్ ఉద్యోగానికి రాజీనామా చేసిన రోజు తనలో ఒక్కసారిగా భయం, ఆందోళన మొదలయ్యాయని సాత్విక నిజాయితీగా చెప్పారు. రెండు ఇంజినీరింగ్ డిగ్రీలు, 4 ఏళ్ల అనుభవాన్ని దేనికోసం వదిలేస్తున్నానా, నా నిర్ణయం తప్పైతే ఏంటి అని ఆ రోజు ఆలోచించారట.

ఇది కూడా చదవండి: సినిమాల్లో నటిస్తే.. బయట అలా తాకాలా: వైరల్ గా మారిన కీర్తి సురేష్ వ్యాఖ్యలు! 
 

కానీ ఆకాశంలో ఒక తార షూటింగ్ మొదలైన తర్వాత ఆ భయాలన్నీ మాయమయ్యాయి. 157 నిమిషాల నిడివితో నవంబర్ 20, 2026న విడుదలైన ఈ సినిమాలో ఆమె పాత్ర ఒక గ్రామీణ యువతి చుట్టూ తిరుగుతుంది.   అమెరికాలో పెరిగిన సాత్వికకు పల్లెటూరి అమ్మాయిగా కనిపించడం, ముఖ్యంగా స్కూల్ యూనిఫామ్‌లో తనను తాను అద్దంలో చూసుకోవడం తొలుత చాలా ఆశ్చర్యం కలిగించిందట

 

. 

ఆకాశంలో ఒక తారలో కల్పన గా అత్యద్భుతంగా నటించి తన కలలని  నెరవేర్చుకోవడానికి ఆకాశమే హద్దుగా పోరాడే యువతిగా అత్యద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఎంతో మందికి రోల్ మోడల్ గా నిలిచింది. ఎటువంటి సినీ నేపథ్యం లేకపోయినా, కేవలం తన ప్రతిభ, పట్టుదలతో ఇంత పెద్ద అవకాశాన్ని అందిపుచ్చుకున్న సాత్విక వీరవల్లి భవిష్యత్తులో టాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా ఎదగడం ఖాయమని కూడా  సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

 

మీకు నచ్చవచ్చు: రామాయణ పార్ట్ 2 లో రణబీర్, యష్ ని మించి ఈ స్టార్ నటుడు!
మీకు నచ్చవచ్చు: ఆకాశంలో ఒక తార మూవీ రివ్యూ!

 

 

[Satvika Veeravalli , Aakasamlo Oka Tara,  Pavan Sadineni, Dulqer, Shruthi Haasan]


              
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com