తారక్ కొత్త కారు రూ.3 కోట్లు.. ఫ్యాన్సీ నెంబర్ కోసం ఎంత ఖర్చు పెట్టారో తెలుసా!!
on Sep 23, 2021
యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్యారేజ్ లో మరో ఖరీదైన కారొచ్చి చేరింది. ఆయన ఇటీవల లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ కారును కొనుగోలు చేశారు. ఇటలీ నుంచి ఆయన ప్రత్యేకంగా తెప్పించుకున్న ఈ కారు ధర రూ.3.43 కోట్లు అని సమాచారం. అయితే ఇంత ధర పెట్టి కొనుగోలు చేసిన కారు నెంబర్ కోసం తారక్ ఏకంగా రూ.17 లక్షలు ఖర్చు పెట్టడం విశేషం.
తారక్ తన అన్నీ కార్లకి '9999' నెంబర్ వచ్చేలా చూసుకుంటారు. తన తాతగారు ఎన్టీఆర్, తండ్రి హరికృష్ణ ఇదే నంబర్ కార్లను ఉపయోగించేవారని.. అందుకే ఈ నెంబర్ తాను ఎంతో సెంటిమెంట్ గా భావిస్తానని తారక్ పలు సందర్భాల్లో చెప్పారు. ఆ సెంటిమెంట్ ప్రకారమే ఇటీవల కొన్న తన ఖరీదైన కారుకి ఫ్యాన్సీ నెంబర్ '9999' కోసం వేలంలో తారక్ పోటీపడ్డారు. తాజాగా ఖైరతాబాద్ ఆర్టీఏ అధికారులు ఫ్యాన్సీ నెంబర్ల కోసం వేలం నిర్వహించగా.. 'TS 09 FS 9999' నెంబర్ ను దక్కించుకోవడానికి తారక్ ఏకంగా 17 లక్షలను చెల్లించారట.
కాగా తారక్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న 'ఆర్ఆర్ఆర్' సినిమాలో నటిస్తున్నారు. ఆ తర్వాత కొరటాల శివ, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్స్ లైన్ లో ఉన్నాయి. మరోవైపు 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తూ బుల్లితెరపై కూడా తారక్ అలరిస్తున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
