అక్టోబర్ 25న 'బాహుబలి' వచ్చేస్తోంది..!!
on Sep 29, 2015
వెండితెరపై రికార్డుల దుమ్ముదులిపిన 'బాహుబలి' ఇప్పుడు బుల్లి తెర పై కూడా సత్తా చాటడానికి సిద్ధమవుతోంది. దాదాపు 18 కోట్ల రూపాయలను చెల్లించి సినిమా శాటిలైట్ లైట్ హక్కులను మాటీవి దక్కించుకుంది. ఇప్పటికే కమింగ్ సూన్ అంటూ టీ.వి సీరియళ్ల మధ్యలో వాయించేస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 25న ఈ మూవీని బుల్లితెరపై ప్రసారం చేయనున్నారని అంటున్నారు. అయితే ఇంత భారీ ధరకు శాటిలైట్ దక్కించుకున్న మా టీవి మొత్తం యాడ్ ల ద్వారా పిండేయాలని చూస్తుంది. అందుకే సినిమా మధ్యలో వచ్చే ఒక్కో యాడ్ అక్షరాలా రెండు లక్షల యాభై వేలట. నిడివి 10 సెకెన్లు మాత్రమే.
అదే సమయంలో షూటింగ్ అనుభవాలను యూనిట్ బుల్లి తెర ప్రేక్షకులతో పంచుకోనుంది. దానికి సంబంధించిన షూట్ కూడా ఇప్పటికే ఫినిష్ అయిపోయిందని అంటున్నారు. ఆ రోజుకు ముందు అంటే 24న సినిమా మేకింగ్, ఇంటర్వ్యూలను సుమారు రెండు గంటలపాటు మాటీవిలో టెలికాస్ట్ చేయనున్నారు. బాహుబలి విడుదలై మూడు నెలల కూడా గడవక ముందే బుల్లి తెరపై రావడం ఆసక్తికరంగా వుంది.