
-పాన్ ఇండియా వ్యాప్తంగా డ్రాగన్ రికార్డుల మోత
-ఫ్యాన్స్ అయితే సంబరాల్లో బిజీ
-అయితే ఎన్టీఆర్ క్యారక్టర్ లూగర్ పై కూడా చర్చ
-అసలు లూగర్ అంటే ఏంటి!
-ఈ డీటెయిల్స్ మీ కోసమే
'డ్రాగన్'(Dragon)ఫస్ట్ గ్లింప్స్ పాన్ ఇండియా లెవల్లో హయ్యస్ట్ రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది. అయితే గ్లింప్స్ రిలీజైనప్పట్నుంచి ఫ్యాన్స్, ఫిలిం సర్కిల్స్‌తో పాటు నెటిజన్లలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ప్రశాంత్ నీల్ తన గత చిత్రాలైన కేజీఎఫ్ లో రాకీ బాయ్, సలార్ లో దేవా లాంటి మాస్ పేర్లని ఫిక్స్ చేస్తే ఎన్టీఆర్ పోషిస్తున్న క్యారక్టర్ పేరు లూగర్ అని రివీల్ చేసారు. దీంతో ఆ పేరు వెనుక ఉన్న మర్మమేంటి అని వాళ్లంతా గూగుల్‌లో కూడా తెగ వెతికేస్తున్నారు. .
గూగుల్ సమాచారం ప్రకారం లూగర్ అనేది సాధారణ పేరు కాదు, ఇది మొదటి రెండవ ప్రపంచ యుద్ధాల సమయంలో జర్మనీ సైనికులు తమ ప్రామాణిక సర్వీస్ ఆయుధంగా ఉపయోగించిన అత్యంత శక్తివంతమైన 9mm సెమీ ఆటోమేటిక్ పిస్టల్ పేరు. ఎంతో ఖచ్చితత్వం, గురి తప్పని నమ్మకానికి లూగర్ పిస్టల్ పెట్టింది పేరు. జర్మనీ పిస్టల్ తరహాలోనే ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ కూడా శత్రువుల గుండెల్లో బుల్లెట్‌లా దూసుకుపోయేలా, గురి తప్పని వైల్డ్ ఎనర్జీతో, పవర్‌ఫుల్‌గా, డైనమిక్‌గా ఉండబోతోందని చెప్పడానికే లూగర్ పేరుని డిజైన్ చేశారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also read: Aditi Govitrikar: సంచలన నిజాలు బయటపెట్టిన పవన్ తమ్ముడు మూవీ లవ్లీ... లైంగికంగా వేధించారు
అయితే ఎన్టీఆర్ తో పాటు క్యారక్టరలందరికి ఆయుధాల పేరుని ఎందుకు ఫిక్స్ చేసానేది సస్పెన్స్. ఎన్టీఆర్ కెరీర్ లోనే హయ్యస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న డ్రాగన్ ని మైత్రీ మూవీ మేకర్స్ ,ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జూన్ 11, 2027 వరల్డ్ వైడ్ టేక్ ఆఫ్ డేట్






