Home

»

Latest News

Aditi Govitrikar: సంచలన నిజాలు బయటపెట్టిన పవన్ తమ్ముడు మూవీ లవ్లీ... లైంగికంగా వేధించారు 

May 20, 2026

 

 

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)బ్లాక్‌బస్టర్ మూవీ తమ్ముడులో లవ్లీగా పవన్ కి జతగా చేసిన నటి  అదితి గోవిత్రికర్(Aditi Govitrikar). కేవలం వెండితెరపైనే కాదు, నిజజీవితంలో ఆమె ఎంతోమందికి ఒక రోల్ మోడల్. వృత్తిరీత్యా ఆమె ఒక డాక్టర్.సైకాలజిస్ట్ గా ఎంతో మందికి సేవలందించింది. అలాగే  2001లో 'మిసెస్ వరల్డ్' కిరీటాన్ని కైవసం చేసుకున్న ఏకైక భారతీయ మహిళగా కూడా రికార్డు సృష్టించింది.

అదితి రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏడూ సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, నా తండ్రి స్నేహితుడు నన్ను లైంగికంగా వేధించాడు. ఆ వయసులో నాకు అసలు  ఏమీ అర్థం కాలేదు. కానీ ఆ వ్యక్తి ప్రవర్తన, స్పర్శ  తీవ్రమైన అసౌకర్యాన్ని, భయాన్ని కలిగించాయి. ఆ పసి వయసులో ఎదురైన భయానక అనుభవాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక పది, పదిహేను  సంవత్సరాల పాటు  తీవ్రమైన మానసిక వేదనని అనుభవించాను.


ప్రస్తుతం 20% కంటే ఎక్కువ మంది పిల్లలు ఏదో ఒక రూపంలో ఇలాంటి వేధింపులకి  గురవుతున్నారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అందుకే, సమాజంలో ఈ అంశంపై అవగాహన పెంచడం కోసమే  ఇప్పుడు ఇంత ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. తల్లిదండ్రులు తమ పిల్లలతో స్నేహపూర్వకంగా ఉంటు వారి ప్రవర్తనలో వచ్చే చిన్న చిన్న మార్పులని  కూడా గమించాలంటూ చెప్పుకొచ్చింది.

Also read: Dhurandhar 2 :ధురంధర్ 2కి  ఢిల్లీ హైకోర్టు షాక్.. దేశ భద్రతకే ముప్పా!
  

ముంబైకి చెందిన అదితి 1998 లో ముఫజల్‌ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని  2009 లో విడాకులు తీసుకుంది. 1999 లో వచ్చిన తమ్ముడు మూవీతోనే సినీ అరంగ్రేటం చేసింది. తెలుగులో మరో చిత్రంలో చేయలేదు. కానీ బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసి సత్తా చాటింది.  49 ఏళ్ల అదితి ప్రస్తుతం చిత్ర పరిశ్రమకి దూరంగా ఉంటు ముంబైలోనే   డాక్టర్‌గా వర్క్ చేస్తుంది.

 


 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com