వారం గ్యాప్ లో నిత్యా డబుల్ ధమాకా!
on Nov 24, 2021

`అలా మొదలైంది` (2011)చిత్రంతో తెలుగునాట కథానాయికగా తొలి అడుగేసిన కేరళకుట్టి నిత్యా మీనన్.. పదేళ్ళ టాలీవుడ్ కెరీర్ లో పలు విభిన్న పాత్రల్లో అలరించింది. అభినయానికి ఆస్కారమున్న పాత్రలకే ఓటేసే ఈ టాలెంటెడ్ బ్యూటీ.. గతంతో పోలిస్తే కాస్త జోరు తగ్గించిందనే చెప్పాలి. అయితే, ఈ డిసెంబర్ లో మాత్రం నిత్యా మీనన్ రెండు సినిమాలతో పలకరిస్తోంది. కేవలం వారం గ్యాప్ లో ఆమె నటించిన ఆ రెండు చిత్రాలు థియేటర్స్ లో సందడి చేయనుండడం విశేషం.
ఆ వివరాల్లోకి వెళితే.. నిత్య ప్రధాన పాత్రలో తనే ఓ నిర్మాతగా తెరకెక్కిన `స్కైలాబ్` చిత్రం డిసెంబర్ 4న రిలీజ్ కాబోతోంది. రొటీన్ కి భిన్నంగా ఈ సినిమా ఉండబోతున్నట్లు ప్రచార చిత్రాల్లో స్పష్టమవుతోంది. ఇక `స్కైలాబ్` రిలీజయిన వారం లోపే అంటే డిసెంబర్ 10న నిత్య నటించిన మరో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ రాబోతోంది. ఆ చిత్రమే.. `గమనం`. ఇందులో నిత్య ఓ కీలక పాత్రలో కనిపించనుంది. మరి.. తక్కువ గ్యాప్ లోనే రాబోతున్న ఈ సినిమాలతో నిత్య ఎలాంటి ఫలితాలను, గుర్తింపుని పొందుతుందో చూడాలి.
అన్నట్టు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జోడీగా నిత్యా మీనన్ నటిస్తున్న `భీమ్లా నాయక్` కూడా విడుదలకు సిద్ధమవుతోంది. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 12న `భీమ్లా నాయక్` రిలీజ్ కానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



