Home

»

Latest News

తమ్ముడు మొదటి రోజు కలెక్షన్స్ ఇవే!

Jul 05, 2025

నితిన్(Nithiin)దిల్ రాజు(Dil Raju), వేణు శ్రీరామ్(Venu Sriram)కాంబోలో నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ 'తమ్ముడు'(Thammudu). యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో నితిన్ కి ఒకప్పటి సీనియర్ హీరోయిన్ లయ సోదరిగా నటించగా సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, శ్వాసిక విజయ్, సౌరభ్ సచ్ దేవ్, హరిత కీలక పాత్రలు పోషించారు. అజనీష్ లోక్ నాధ్ సంగీతాన్ని అందించాడు.

తమ్ముడు మూవీ మొదటి రోజు రెండు కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ ని సాధించినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీంతో మరోసారి నితిన్ తన కెరీర్ లో మొదటి రోజు అతి తక్కువ కలెక్షన్స్ ని అందుకున్నాడు. నితిన్ గత చిత్రం 'రాబిన్ హుడ్' కూడా తొలి రోజు 2 కోట్ల రూపాయిల నెట్ కలెక్షన్స్   ని వసూలు చేసినట్టుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

తమ్ముడు మూవీ చూసిన చాలా మంది ప్రేక్షకులు పలు మీడియా సంస్థలతో మాట్లాడుతు కథ కథనాలు, దర్శకత్వం, మాటలు ఇలా అన్ని విభాగాల్లోను తమ్ముడు ఫెయిల్ అయ్యిందని, నితిన్ తో పాటు మిగతా నటి నటులు పెర్ ఫార్మెన్స్ పరంగా  బాగా చేశారనే అభిప్రాయాన్ని వెల్లడి చేస్తున్నారు.



 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com