ప్రముఖ హీరోయిన్ ఆస్తులు జప్తు.. ఇది ఆ హీరో పనే
on Jul 5, 2025
ప్రముఖ కన్నడ నటి 'రన్యారావు'(Ranya Rao)మార్చి 3 వ తారీఖున 14 .2 కేజీల బంగారం అక్రమరవాణా చేస్తు బెంగుళూరు(Bengaluru)ఎయిర్ పోర్ట్ లో పోలీసులకి పట్టుబడిన విషయం తెలిసిందే. దీంతో ఆమెపై బంగారం అక్రమ రవాణా, మనీలాండరింగ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో రన్యారావు ప్రస్తుతం జైలులో ఉంది. విచారణ సమయంలో ఆ బంగారాన్ని దుబాయ్, ఉగాండా ద్వారా దిగుమతి చేస్తున్నట్లు అధికారులతో చెప్పింది.
రీసెంట్ గా రన్యారావు కి సంబంధించిన 34.12 కోట్ల రూపాయిల విలువైన ఆస్తులని 2002 లో ఏర్పాటు చేసిన మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద 'ఈడి' జప్తు చెయ్యడం జరిగింది. అధికారులు స్వాధీనం చేసుకున్న వాటిల్లో బెంగళూరు, తుమకూరు జిల్లాల్లోని విలాసవంతమైన ఇల్లు, ఒక ప్లాట్ , పారిశ్రామిక భూమి, వ్యవసాయ భూమి ఉన్నాయి. ఈ కేసులో రన్యారావుతో పాటు ఆమె సహచరుడు, సినీ హీరో 'తరుణ్ కొండూరురాజు'(Tarun Konduru Raju)ని కూడా అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. చాలా కాలం నుంచి ఆ ఇద్దరు కలిసే బంగారం అక్రమ రవాణా చేస్తున్నారని దర్యాప్తులో వెల్లడి అయ్యింది. వాటికి సంబంధించిన పూర్తి లావాదేవిలని కూడా రాబట్టే యోచనలో అధికారులు ఉన్నారు.
రన్యారావు 2014 లో సుదీప్ హీరోగా వచ్చిన 'మాణిక్య' అనే మూవీతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత 2016 లో విక్రమ్ ప్రభు హీరోగా తమిళంలో వచ్చిన 'వాఘ' అనే మూవీ ద్వారా ప్రేక్షకులని మెప్పించింది. తరుణ్ కొండూరు 2018 లో 'పరిచయమం' అనే తెలుగు సినిమాతో విరాట్ కొండూరు అనే పేరుతో హీరోగా పరిచయమయ్యాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
