ప్రముఖ హీరో నిఖిల్ లైఫ్ లో పెద్ద ట్విస్ట్
on Nov 4, 2024
కార్తికేయ పార్ట్ (karthikeya 2)తో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందిన నిఖిల్(nikhil)నవంబర్ 8 న 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో'(appudo ippudo eppudo)అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.రుక్మిణి వసంత్(rukmini vasanth)దివ్యాంశ కౌశిక్(Divyansha Kaushik)హీరోయిన్లు గా చేస్తున్నఈ మూవీకి సుధీర్ వర్మ దర్శకుడు. గతంలో సుధీర్ వర్మ, నిఖిల్ కాంబోలో స్వామి రారా, కేశవ్ మూవీలు వచ్చి ఉండటంతో ప్రేక్షకుల్లో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో పై మంచి అంచనాలే ఉన్నాయి.
రీసెంట్ గా ఆ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో నిఖిల్ మాట్లాడుతు ఈ మూవీని ఎప్పుడు తెరకెక్కించాననే అనుమానం చాలా మందిలో ఉంది.కార్తికేయ తర్వాత ఈ మూవీని తెరకెక్కించాలని అనుకున్నాను. స్పై కంటే ముందే ఈ మూవీ రిలీజ్ కావాలి. కానీ కొన్ని కారణాల వాళ్ళ లేట్ అయ్యింది.ఇప్పుడు చేస్తున్న సినిమాకి కొంచం బ్రేక్ రాగానే దీన్ని పూర్తి చేశాను.తాజాగా ఈ మూవీ ప్రివ్యూ షో వేస్తే మంచి స్పందన వచ్చింది. స్వామి రారా లో మిస్ అయినా ప్రేమికుడిని ఇందులో చూస్తారు.ప్రతి పది నిమిషాలకి ఒక ట్విస్ట్ ఉండటంతో పాటు ప్రేక్షకులు ఒక కొత్త ప్రపంచంలోకి కూడా వెళ్తారు.ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ ని ఎవరు ఊహించలేరు. మూవీపై పూర్తి నమ్మకముందని చెప్పుకొచ్చాడు.
శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ పతాకంపై బి వీ ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' లో అజయ్, వైవా హర్ష,జాన్ విజయ్ ముఖ్య పాత్రలు పోషించారు.నిఖిల్ ప్రస్తుతం స్వయంభు అనే పీరియాడిక్ యాక్షన్ డ్రామాతో కూడిన మూవీని చేస్తున్న విషయం అందరకి తెలిసిందే. ఇందులో నిఖిల్ యుద్ధ వీరుడుగా కనిపించబోతుండగా మెగా ప్రొడ్యూసర్ ఠాగూర్ మధు నిర్మిస్తున్నాడు.సంయక్త మీనన్ కధానాయికగా చేస్తుంది.