కిరణ్ అబ్బవరంపై ట్రోల్ చేస్తున్న యంగ్ హీరో
on Nov 4, 2024
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(kiran abbavaram)నటించిన 'క'(ka)మూవీ దీపావళి కానుకగా ఈ నెల 31 న విడుదలైన విషయం తెలిసిందే. సుజిత్ సందీప్(sujith sandeep) ల దర్శకత్వ ద్వయంలో తెరకెక్కిన ఈ మూవీలో నయన్ సారిక(nayan saarika)హీరోయిన్ గా చెయ్యగా తన్వి రామ్ కీలక పాత్ర పోషించింది. కిరణ్ అబ్బవరం పలు ఇంటర్వూస్ లో మాట్లాడుతూ ఇండస్ట్రీ కి చెందిన వ్యక్తులే తనని ట్రోల్ చేస్తున్నారని,హైదరాబాద్ లో ఉన్న జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఒక సంస్థ ఆధ్వర్యంలో అదంతా నడుస్తుందని చెప్పుకొచ్చాడు.
ఇప్పుడు ఈ విషయంపై ప్రముఖ నిర్మాత నట్టి కుమార్(natti kumar)మాట్లాడుతు కిరణ్ అబ్బవరం చెప్పింది నిజమే,కొంత మంది యంగ్ హీరోల్లో ఒకరికి ఒకరు పడక కావాలనే కిరణ్ ని ట్రోల్ చేస్తున్నారు.జూబ్లీ హిల్స్ దగ్గర ఉన్న ఆ సంస్థ పేరుని కిరణ్ బయట పెట్టాలి. కాకపోతే ట్రోల్స్ 'క' విజయాన్ని ఆపలేకపోయాయి.కిరణ్ ఫస్ట్ మూవీ ఎస్ ఆర్ కల్యాణ మండపం తర్వాత మళ్ళీ 'క' కి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. టాలెంట్ ఉంటే ఇక్కడ ఎవరు ఎవర్ని ఆపలేరు. 'క' మూవీ కంటెంట్ బాగుంది కాబట్టే ఇప్పడు థియేటర్స్ కూడా పెరిగాయని చెప్పుకొచ్చాడు.