ఓంకార్ తమ్ముడు అశ్విన్ నెక్స్ట్ మూవీ.. డైరెక్టర్ ఎవరంటే?..
on Jul 31, 2021
యాంకర్, దర్శకుడు ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు.. 'జీనియస్' సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చి 'రాజు గారి గది' సిరీస్ తో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అశ్విన్ హీరోగా ఓ కొత్త ప్రాజెక్టులో నటించబోతున్నాడు. అశ్విన్ కెరీర్లో ఏడవ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా అధికారిక ప్రకటన తాజాగా వచ్చింది.
'AB7'అనే వర్కింగ్ టైటిల్ తో అశ్విన్ బాబు ఏడవ సినిమా ప్రీ లుక్ ను మేకర్స్ వదిలారు. ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. రక్తం ఓడుతున్న చేతితో పిడికిలి బిగించి పోస్టర్ పవర్ ఫుల్ గా ఉంది. అలాగే మూవీ టైటిల్ ని, ఫస్ట్‌లుక్ ని రేపు(ఆదివారం) మధ్యాహ్నం 2.52 గంటలకు విడుదల చేస్తున్నట్లు పోస్టర్ లో తెలియజేశారు.
గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి అనిల్ కన్నెగంటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఆయన దర్శకత్వంలో గతంలో 'అసాధ్యుడు', 'మిస్టర్ నూకయ్య', 'రన్' సినిమాలు వచ్చాయి. ఇప్పుడు అశ్విన్ తో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ఈ సినిమాలో అశ్విన్ సరసన నందిత శ్వేత హీరోయిన్ గా నటిస్తోంది.
Also Read