'ఆర్ఆర్ఆర్' ఫ్యాన్స్ కి పండగే.. ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది!
on Dec 4, 2021
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'ఆర్ఆర్ఆర్'. బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో పాటు తారక్, చరణ్ వంటి స్టార్స్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఈ మూవీ ట్రైలర్ కోసం ప్రేక్షకుల ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ట్రైలర్ కి సంబంధించిన అప్డేట్ వచ్చింది.
నిజానికి 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ డిసెంబర్ 3 న విడుదల కావాల్సి ఉంది. అయితే లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూయడంతో.. ఆయనకు సంతాపం ప్రకటిస్తూ మూవీ టీమ్ ట్రైలర్ విడుదలను వాయిదా వేసింది. ట్రైలర్ వాయిదా పడటంతో ఫ్యాన్స్ లో కాస్త నిరాశ నెలకొంది. అయితే మూవీ టీమ్ తాజాగా ట్రైలర్ అప్డేట్ ఇచ్చి ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపింది. 'ఆర్ఆర్ఆర్' మూవీ ట్రైలర్ ను డిసెంబర్ 9 న విడుదల చేస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. డిసెంబర్ 9న ఉదయం 10గంటలకు థియేటర్స్ లో ట్రైలర్ ను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ పేర్కొన్నారు. ఇప్పటికే 'ఆర్ఆర్ఆర్' టీజర్ బిగ్ స్క్రీన్స్ పై సందడి చేస్తోంది. త్వరలో 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ కూడా అలరించనుంది.
డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న 'ఆర్ఆర్ఆర్'లో చరణ్ కి జోడీగా అలియా భట్, తారక్ కి జోడీగా ఒలివియా మోరిస్ నటిస్తున్నారు. అజయ్ దేవ్గణ్, శ్రియ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా జనవరి 7 న ప్రేక్షకుల ముందు రానుంది.
Also Read