అర్ధరాత్రి రోడ్లమీద పవన్ ఫ్యాన్స్ వీరంగం
on Mar 24, 2017

పవన్ కల్యాణ్ సినిమా విడుదల అవుతోందంటే.. ఆ ఉత్సాహమే వేరు. ఫ్యాన్స్ జోరు అడ్డుకట్ట వేసే ధైర్యం ఎవ్వరూ చేయలేరు. పవన్ సినిమా అంటే బెనిఫిట్ షో పడిపోవాల్సిందే. ఆరు నూరైనా... అందరి కంటే ముందు పవన్ ఫ్యాన్స్ సినిమా చూసేయాల్సిందే. కాటమరాయుడు విడుదల సందర్భంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ముందస్తు ఆటలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాత్రి ఒంటి గంట తరవాత షోలు వేసుకోవొచ్చని చెప్పింది. అయితే.. హైదరాబాద్‌లో ఫ్యాన్స్‌కి మాత్రం నిరాశ ఎదురైంది. పర్మిషన్లు ఇవ్వడానికి పోలీసులు ససేమీరా అనడంతో... హైదరాబాద్ లోని శ్రీరాములు థియేటర్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
ఫ్యాన్స్ పోలీసులతో, థియేటర్ యాజమాన్యంతో వాగ్వివాదానికి దిగారు. బెనిఫిట్ షోలకు పర్మిషన్లు ఇవ్వకపోతే.. ఊరుకొనేది లేదని హెచ్చరించాయి. హైదరాబాద్‌లోని మూసాపేట రోడ్లపై కాసేపు పవన్ అభిమానులు భైఠాయించారు. రోడ్డపై పడుకొని.. తమ నిరసన వ్యక్తం చేశారు. దాంతో చాలా సేపు మూసాపేటలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి, అభిమానుల్ని అక్కడ్నుంచి తరలించినా... పరిస్థితి ఓ కొలిక్కి రాలేదట. పవన్ ఫ్యాన్స్‌ని సముదాయించడానికి పోలీసులు చాలా శ్రమించాల్సివచ్చింది. ఆఖరికి.. బెనిఫిట్ షోకి అనుమతి ఇవ్వడంతో అభిమానులు శాంతించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



