అఫీషియల్: ఏప్రిల్ లో నాని 'వి'
on Mar 14, 2020
నేచురల్ స్టార్ నాని తొలిసారి నెగిటివ్ షేడ్స్ క్యారెక్టర్ చేస్తున్న సినిమా, నటుడిగా నాని 25వ సినిమా 'వి'. సుధీర్ బాబు హీరోగా... నివేదా థామస్, అదితీరావ్ హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకుడు. ఉగాది కానుకగా మార్చి 25న విడుదల చేయాలనుకున్న ఈ చిత్రాన్ని వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయని తెలుగువన్ ముందే చెప్పింది. 'నాని చిత్రాన్ని వాయిదా వేయక తప్పదా?' శీర్షికన ఆ విషయాన్ని పాఠకులకు తెలియజేసింది. చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈరోజు అధికారికంగా ఆ విషయాన్ని ప్రకటించింది. కరోనా వైరస్ కారణంగా సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్టు ప్రముఖ నిర్మాత దిల్ రాజు కాంపౌండ్ నుంచి అనౌన్స్ మెంట్ వచ్చింది. ప్రేక్షకుల ఆరోగ్యం, సేఫ్టీ నీ దృష్టిలో పెట్టుకోవడం తమ బాధ్యత అని, అందుకోసమే సినిమాను వాయిదా వేస్తున్నామని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తెలిపింది. ఏప్రిల్ మూడో వారంలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఏప్రిల్ 17న 'వి' ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
