మణిరత్నం నానీ..ఏమైందసలు?
on Oct 30, 2015
.jpg)
గత కొన్ని రోజులుగా మీడియాలో నానీ - మణిరత్నం సినిమా ఆగిపోయిందన్న వార్తలు తెగ హల్ చల్ చేశాయి. అసలు ఈ సినిమా ఎందుకు ఆగిపోయిందన్న దానిపై కూడా బలంగా చర్చలు కూడా సాగుతున్నాయి. అయితే ఇంతలోనే ఈ ప్రాజెక్ట్ ఆగిపోలేదన్న వార్తలు రావడం స్టార్ట్ అయ్యాయి. మణిరత్నం నానీ సినిమా ఆగిపోలేదని..కాకపోతే కొంచెం లేటుగా స్టార్ట్ అవుతుందని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఈ మల్టీస్టారర్ లో కార్తీ కూడా నటిస్తున్నాడు కాబట్టి అతడి కాల్షీట్ల సమస్య తలెత్తింది. అందుకే కొంతకాలం పాటు వేచి చూసే ఆలోచనలో ఉన్నారు చిత్ర యూనిట్. అందుకే ఈ సినిమాను కొద్ది రోజులు పాటు పక్కన పెట్టారట. అదీ సంగతి. సో..నానీ మణిరత్నం సినిమా వుంటుంది. కానీ ఎప్పుడో చెప్పలేం!!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



