రెండు ఫ్లాప్ లు..మరి మూడోది?
on Oct 30, 2015
.jpg)
తెలుగు ఇండస్ట్రీలో ఒక ఫ్లాప్ ఇస్తే చాలు ఆ దర్శకుడితో సినిమా చేయడానికి ఏ హీరో అంతగా ఇంట్రెస్ట్ చూపించారు. అలాంటి ఇండస్ట్రీలో ఒక దర్శకుడు వరుసగా రెండు ఫ్లాప్ లు ఇచ్చిన అతనితో మూడో సినిమా చేశాడు. ఆ సాహసం చేసిన హీరో ఎవరు అంటారా ? అతనే మన నందమూరి కళ్యాణ్ రామ్. తనకు అభిమన్యు కత్తి లాంటి ఫ్లాప్ సినిమాలు అందించిన మల్లికార్జున్ తో మూడో సినిమా చేశాడు కళ్యాణ్. ఆ సినిమానే షేర్. ఈ సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. కళ్యాణ్ రామ్ ‘పటాస్’ సూపర్ హిట్ తర్వాత ఈ సినిమా రిలీజ్ కావడం .. బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి పోటీ లేకపోవడం ఈ సినిమాకి కలిసివచ్చే అంశాలు. మరి కళ్యాణ్ ‘షేర్’ సినిమా హిట్టవుతుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



