టీజర్ రివ్యూ: నా నువ్వే
on Jan 8, 2018
అందరు హీరోల్లా కమర్షియల్ కథలు కాకుండా.. కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ.. హీరోగా, నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా దూసుకెళ్తున్నాడు నందమూరి కళ్యాణ్‌రామ్. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్నో అంచనాల మధ్య రిలీజైన "ఇజం" అంతగా సక్సెస్ కాకపోవడంతో.. కళ్యాణ్‌రామ్ కాస్త గ్యాప్ తీసుకుని జయేంద్ర అనే కొత్త దర్శకుడితో ఒక సినిమా చేస్తున్నారు. అదే నా నువ్వే. కళ్యాణ్‌రామ్, తమన్నా జంటగా నటిస్తోన్న ఈ మూవీ టీజర్‌ను చిత్రయూనిట్ ఈరోజు రిలీజ్ చేసింది.
"లవ్.. లవ్.. లవ్ ఈ రోజంతా మనం దీని గురించే మాట్లాడుకుందాం" అంటూ రేడియో జాకీగా తమన్నా చెబుతున్న డైలాగ్‌తో టీజర్ స్టార్టవుతుంది. పుస్తకాల గుట్ట మధ్యలో కళ్యాణ్ రామ్‌ను కట్టేయడంతో.. "ప్రేమికా.. మనసుపై స్వారీ చేయ్" అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో వస్తోన్న సాంగ్ బాగుంది. ఈ మూవీ కోసం కళ్యాణ్‌రామ్ మరోసారి మేకోవర్ అయినట్లు స్పష్టంగా తెలుస్తోంది. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫి ఆకట్టుకుంది. ఇందులో కళ్యాణ్ రామ్ వరుణ్‌గా... తమన్నా మీరాగా కనిపించనున్నారు. మొత్తానికి ఎమోషనల్ అండ్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న "నా నువ్వే" సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.