త్రివిక్రమ్ పొలిటికల్ పంచ్!
on Jan 8, 2018
ట్రైలరో... ట్రైలరో.. ట్రైలరో... అని శనివారం రాత్రంగా తెగ జపం చేశారు అభిమానులు. ఎట్టకేలకు శనివారం అర్ధరాత్రి ‘అజ్ఙాతవాసి’ ట్రైలర్ బయటకొచ్చింది. ఇంకా 48 గంటలు కూడా పూర్తి కాలేదు. 6.7 మిలియన్ వ్యూస్ వచ్చాయ్. నాన్ ‘బాహుబలి’ చిత్రాల్లో ఇదే రికార్డ్. అంటే... అప్పుడే తొలి రికార్డును షురూ చూశాడన్నమాట మరి పవన్ కల్యాణా మజాకా. ’ఇది మనం కూర్చునే కుర్చీ... పచ్చని చెట్టును గొడ్డలితొ పడగొట్టి... రంపంతో ముక్కులు ముక్కులగా కసి..బెరడును బ్లేడుతో సానబెట్టి.... వళ్లంతా మేకులతో కొ్ట్టి కొట్టి తయారు చేస్తారు. ఎంత హింస దాగుందో కదా! జీవితంలో మనం కోరుకునే ప్రతి సౌకర్యం వెనకాల...ఓ మినీ యుద్ధమే ఉంటుంది‘ ఈ డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. త్రివిక్రమ్ పెన్ పవర్... కాస్త టేస్ట్ చేయించిందీ డైలాగ్.
ఇక పవన్ మార్క్ యాక్షన్ కు కూడా సిినిమాలో కొదవ ఉండదని తేలిపోయింది. అయితే... ప్రస్తుతం ఈ ట్రైటర్ లో చర్చనీయాంశంగా మారిన డైలాగ్ ఒకటుంది. అదే ‘మళ్లీ సైకిలెక్కుతాడా వర్మ.. ఆడు ఏదెక్కినా ఫర్లేదు కానీ... మనల్ని ఎక్కకుండా ఉంటే చాలు’ ప్రస్తుతం ఎక్కడ విన్నా ఈ డైలాగ్ గురించే టాపిక్. పవన్ పాలిటిక్స్ లో నెక్ట్స్ స్టెప్ ఏంటి? అనే ప్రశ్న ఇప్పుడు అందరిలో ఉంది. అదే ప్రశ్నను ప్రతిబింబించేలా ఈ డైలాగ్ ఉండటం చర్చకు దారితీసిన అంశం. ‘మళ్లీ సైకిలెక్కుతాడా?’ అనేది జనాల్లో ఉన్న ప్రశ్న. ‘ఆడు ఏదెక్కినా ఫర్లేదు కానీ... మనల్ని ఎక్కకుండా ఉంటే చాలు’ అనేది కొన్ని రాజకీయ వర్గాల అభిప్రాయం. ఈ డైలాగ్ తో చిన్న పొలిటికల్ పంచ్ ఇచ్చాడు త్రివిక్రమ్. ఇంకొన్ని గంటల్లో ‘అజ్ఙాతవాసి’ తెరపైకి రాబోతున్నాడు. ట్రైలర్ తోనే ఇంత హంగామా చేసిన పవర్ స్టార్... రేపు వెండితెరపై ఇంకెంత హడావిడి చేస్తాచో చూడాలి.