బాలయ్య కష్టం తీర్చేది ఎవరు..?
on Mar 10, 2017

టాలీవుడ్‌లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది..యంగ్‌హీరోలకు సరిపడా కథానాయికలున్నారు. అంతగా అవసరమైతే కొత్త హీరోయిన్లను ఇంపోర్ట్ చేసుకోవచ్చు. కానీ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ లాంటి సీనియర్ హీరోలను హీరోయిన్ల కొరత వేధిస్తోంది. సీనియర్లు కాబట్టి వారి పక్కన ఆ ఏజ్ వారే సెట్ అవుతారు. ఉన్న ఒకరిద్దరు హీరోయిన్లు కూడా వేరే ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండటంతో సీనియర్ల వేదన వర్ణనాతీతం. దీంతో వారు కూడా కుర్ర హీరోయిన్ల వైపు చూస్తున్నారు. ఇక్కడే అసలు ప్రాబ్లం మొదలవుతోంది. అగ్ర హీరోల పక్కన చేస్తే కెరీర్ టర్న్ అవుతుందని తెలుసినా అంత పెద్ద హీరోల సరసన తాము సెట్ అవ్వమనే ఒక రీజన్‌తో గోల్డెన్ ఆఫర్స్‌ని వదులుకుంటున్నారు యంగ్ హీరోయిన్లు.
నటసింహ నందమూరి బాలకృష్ణ 101వ చిత్రం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రారంభమైంది..అన్ని పర్ఫెక్ట్‌గా సెట్ అయినా హీరోయిన్ సమస్య బాలయ్యను వేధిస్తోంది. అందుకే పూరి డిఫరెంట్ ప్లాన్ వేశాడు..అదే కాస్టింగ్ కాల్..దీనిలో భాగంగా కొన్ని రకాల పాత్రలకు కొత్త వారిని తీసుకుంటున్నాడు..అలాగే హీరోయిన్ కూడా. కథ ప్రకారం ఈ మూవీలో ఇద్దరు కథానాయికలు కావాలట. పూరి ప్లాన్ సక్సెస్ అయ్యి హీరోయిన్ త్వరగా దొరికితే చాలు అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



