భావనకి కాబోయేవాడు మనసున్న మారాజు
on Mar 10, 2017

కొద్ది రోజుల క్రితం మళయాళ హీరోయిన్ భావన మీనన్ కిడ్నాప్, లైంగిక వేధింపుల ఘటన భారతీయ చిత్ర పరిశ్రమను ఉలిక్కిపడేలా చేసింది. ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొని తిరిగి ఇంటికి వస్తుండగా కొందరు గుర్తు తెలియని దుండగులు ఆమెను కారులో బలవంతంగా ఎక్కించుకుని లైంగిక వేధింపులకు గురిచేశారు..ఫోటోలు, వీడియోలు తీశారు. అయితే ఇంత జరిగినా ఆమె క్రుంగిపోలేదు..ధైర్యంగా పోలీసులను ఆశ్రయించింది. ఈ క్రమంలో యావత్ చిత్ర పరిశ్రమ ఆమె వెంట నిలిచింది. అన్నింటికన్నా ముఖ్యంగా ఆమె ప్రేమించిన వ్యక్తి సపోర్ట్ భావనను కాస్త మనిషిని చేసింది. ఆయన మద్ధతుతోనే ఆమె పోరాడగలిగింది.
ఆయన ఎవరో కాదు కన్నడ పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత నవీన్. భావన-నవీన్‌లు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు..త్వరలో పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అయితే నిజానికి ఈ పెళ్లి చెడగొట్టడానికే, భావన మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారు దుండగులు. కాని నిజమైన ప్రేమ ముందు ఎవరి ఆటలు సాగవని మరోసారి నిరూపించింది ఈ జంట. నిన్న భావన-నవీన్‌ల ఎంగేజ్‌మెంట్ సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఏది ఏమైనా ఈ పోరాటంలోభావనకు నవీన్ అందించిన మానసిక స్థైర్యం చాలా గొప్పది. ఆయన తోడ్పాటుతోనే భావన గెలిచింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



