శాతకర్ణి ట్రైలర్ లాంచ్ వాయిదా..?
on Dec 2, 2016
నందమూరి బాలకృష్ణ 100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి గురించి టాలీవుడ్‌తో పాటు అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుని విడుదలకు రెడీ అవుతున్నాడు శాతకర్ణి. అయితే సినిమా ప్రారంభమైన దగ్గర నుంచి కేవలం ఫస్ట్ లుక్, బాలయ్య డైలాగులు మాత్రమే రిలీజ్ చేశారు కానీ సినిమా ట్రైలర్ మాత్రం వదల్లేదు. దీనివల్ల అభిమానులు కొంత డిస్‌ప్పాయింట్ అయ్యారు.
ఈ విషయం గమనించిన దర్శకనిర్మాతలు ట్రైలర్‌ను ఈ నెల 9వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. అటు ఫ్యాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేశారు. కానీ చిత్రయూనిట్ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 16న తిరుపతిలో జరిగే ఆడియో వేడుకలోనే ట్రైలర్‌ని కూడా రిలీజ్ చేయాలనుకుంటున్నారట. ఎందుకంటే ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగేలా ట్రైలర్‌ను కట్ చేసి, ఆడియో వేడుకను వెరైటీగా జరపాలని సినిమా యూనిట్ భావించడం వల్లే ట్రైలర్ లాంచ్ వాయిదా వేశారని ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.