"రాజు" నుంచి "రైతు"గా బాలయ్య..?
on Oct 6, 2016

కుర్ర హీరోలే సినిమాలు చేయడానికి నానా తంటాలు పడుతున్న సమయంలో నందమూరి నటసింహం బాలకృష్ణ మాత్రం జెట్ స్పీడుతో దూసుకెళుతున్నారు. కెరిర్‌లో 99 సినిమాలు పూర్తి చేసి 100 వ సినిమా చేస్తున్న బాలయ్య..తన తదుపరి చిత్రాన్ని కూడా లైన్‌లో పెట్టేశాడు. 100వ సినిమా కోసం చాలా కథలు విన్న నటసింహం చివరగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ, జాతీయ అవార్డు గ్రహీత క్రిష్ వినిపించిన కథలను పక్కను బెట్టుకుని శాతకర్ణికి ఓటేశాడు. అయితే వంశీ చెప్పిన కథ బాగా నచ్చడంతో దానిని తన 101వ సినిమాగా చేయాలని డిసైడయ్యాడట. దీంతో శాతకర్ణి షూటింగ్ పూర్తికాగానే కృష్ణవంశీ సినిమాకి కొబ్బరికాయ కొట్టనున్నాడు. ఫిలింనగర్ టాక్ ప్రకారం ఈ సినిమా టైటిల్‌గా రైతు అని తెలుస్తోంది. ఈ చిత్రంలో బాలయ్య రైతు నేతగా కనిపిస్తాడని సమాచారం. రైతుల సంక్షేమం కోసం వారి తరపున వారి సమస్యలపై పోరాడతాడట. మొత్తానికి బాలకృష్ణ దేశాన్ని ఏలే రాజుగా నుంచి రైతుగా మారిపోతాడన్న మాట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



