పెళ్లి పీటలెక్కుతున్న డాన్ హీరోయిన్..!
on Oct 6, 2016

టాలీవుడ్‌లో ప్రజంట్ పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది..సీనియర్ హీరోలు, డైరెక్టర్లు అన్న తేడా లేకుండా వన్ బై వన్ బ్యాచిలర్ లైఫ్‌కి గుడ్‌బై చెప్పేసి మ్యారేజ్ లైఫ్‌లోకి ఎంటరైపోతున్నారు. తాజాగా హాయ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై కళ్యాణరాముడు, సంబరం, ఖుషీఖుషీగా, డాన్, అనసూయ చిత్రాలతో పాటు... కన్నడంలోనూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ముంబై భామ నిఖిత కూడా త్వరలో పెళ్లి పీటలెక్కబోతోంది. ముంబైకి చెందిన వ్యాపారవేత్త గగన్‌దీప్ సింగ్ మగోతో నిఖిత గత కొంతకాలంగా ప్రేమాయణం నడుపుతోంది.
గగన్‌ని గత ఏడాది డిసెంబర్‌లో నా కజిన్ వివాహంలో కలిశాను. అప్పుడే అతడు నన్ను ఇష్టపడ్డాడు. నా సోదరిని అడిగి నాతో మాట్లాడాడు. కొద్ది రోజులకు ముంబయి రెస్టారెంట్‌లో మోకాలిపై నిలబడి డైమండ్ రింగ్‌తో నాకు ప్రపోజ్ చేశాడు. అతడే నాకు కాబోయే భర్త, అతడు లేకుండా నా జీవితాన్ని వూహించుకోలేను అంటూ తన ప్రేమ కథను చెప్పింది. ఈ దసరాకి మా వివాహం జరగబోతోందని రేపటి నుంచి మెహందీ, సంగీత్ కార్యక్రమాలు మొదలవబోతున్నాయని నిఖిత స్వయంగా తెలిపింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



