నట "సింహా"వతారం ..!
on Jun 10, 2016
నటరత్న, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు నటవారసుడిగా సినీరంగ ప్రవేశం చేశారు బాలకృష్ణ. నటనలో తండ్రి నుంచి ఓనమాలు నేర్చుకున్న ఆయన తనదైన నటనతో తెలుగుతెరపై చెరగని ముద్రవేశారు. అందరు హీరోలు అన్ని రకాల పాత్రలు చేయలేరు. కొందరు కొన్ని క్యారెక్టర్లకే సెట్ అవుతారు.. కాని బాలకృష్ణ వీరందరికి భిన్నం, తండ్రిలాగే ఏ జోనర్ అయినా ఎలాంటి క్యారెక్టర్ అయినా అద్భుతంగా పోషించి మెప్పించగల నైపుణ్యం బాలయ్య సొంతం. నాటి తరంతోనే ముగిసిపోయాయని భావించిన పౌరాణిక, జానపద చిత్రాల్లో నటించి తిరిగి వాటికి జవసత్త్వాలు కలిగించిన ఘనత బాలయ్యదే. నేటి తరం హీరోల్లో డైలాగ్స్ చెప్పడంలో ఆయనకు సాటి రాగలవారు లేరు. నటుడిగా తన ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లను చేరుకున్న బాలకృష్ణ, ఈ ఏడాది 100 వ చిత్రాన్ని చేస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న గౌతమీపుత్ర శాతకర్ణి ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయే చిత్రం కావాలని కోరుకుంటూ ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న నందమూరి నటసింహానికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన నటించిన సినిమాల్లో పేరుతెచ్చిన కొన్ని చిత్రాలను చూద్దాం.
1. జానపదం
2. పౌరాణికం
3. చారిత్రకం
4. భక్తి
5. సైన్స్ ఫిక్షన్
6. ఫ్యాక్షన్
7. కామెడీ