సుల్తాన్ గా మారిపోయిన బన్నీ..!
on Jun 9, 2016
ఒక పక్కన సరైనోడు 50 రోజులు పూర్తి చేసుకుంటుంటే, మరో పక్క బన్నీ విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నాడు. భార్యతో కలిసి టర్కీ వెళ్లిన బన్నీ, అక్కడ మొత్తం చుట్టేస్తున్నాడు. ఒక స్టార్ హీరోకు ఏ గౌరవం లభిస్తుందో అదే గౌరవాన్ని పొందాడు బన్నీ. అక్కడ ఇస్తాంబుల్ లో అన్ని టూరిస్ట్ ఏరియాల్ని ఒక రౌండ్ వేసేస్తున్నాడు. పర్యటనలో భాగంగా, ఇస్తాంబుల్ లోని సుల్తాన్ అహ్మద్ కమీ బ్లూ మశీదును సందర్శించిన బన్నీ, ఇప్పటి వరకూ అలాంటి మశీదును చూడలేదని ట్వీట్ చేశాడు. అంతేకాదండోయ్, అక్కడ ఉన్న సుల్తాన్ దుస్తులు వేసుకుని, సింహాసనంపై టర్కీ సుల్తాన్ లా స్టిల్ ఇచ్చాడు. ఆయన పక్కన స్నేహారెడ్డి కూడా రాణి బేగంగా డ్రస్ చేసుకుని విసినకర్రతో స్టిల్ ఇచ్చింది. ఓవరాల్ గా ఫోటో చూస్తుంటే, బన్నీ వారు సుల్తాన్ గా సినిమా చూస్తే ఎలా ఉంటారో అలా ఉంది. స్టిల్ అదుర్స్ కదూ..!

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
