మాట్లాడేది మన బాలయ్యేనా?
on Apr 22, 2016

నందమూరి బాలకృష్ణ..నటనలో 40 ఏళ్ల అనుభవం, ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన ఈ టాలీవుడ్ అగ్రనటుడి నోటి వెంట తత్వశాస్త్రం వచ్చింది. తన 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్ అన్నపూర్ణా స్టూడియోస్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై బాలకృష్ణను ఆశీర్వదించారు. అనంతరం అభిమానులతో మాట్లాడిన నటసింహ నీకు నువ్వు నచ్చితే ఏం చేసినా బాధపడాల్సిన అవసరం లేదన్నారు. అలాగే నీకు నువ్వు నచ్చనప్పుడు జీవితంలో ఏం సాధించినా ఉపయోగం లేదని చెప్పారు. నీకు నువ్వు నచ్చినపుడు ఏం చేసినా బాధపడాల్సిన అవసరం లేదని, ఎవరి మెహర్బానీ కోసం పాకులాడాల్సిన అవసరం లేదన్నారు. సినిమాల్లోనూ, స్టేజ్ మీద బాలయ్య కనిపిస్తే చాలు పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో కనువిందుచేస్తారు బాలయ్య . అందుకు భిన్నంగా ఇవాళ మాట్లాడేసరికి ఫ్యాన్స్ మాట్లాడేది మన బాలయ్యేనా? అని ఆశ్చర్యపోయారు. ఏదైనా జీవితం తనకు నేర్పిన పాఠం..వయసు మీద పడుతుండటంతో బాలయ్య కాస్త హుందాగా వ్యవహరిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



