టాప్ 5 లోకి చేరుకున్న ఊపిరి..!
on Apr 19, 2016
.jpg)
కింగ్ నాగార్జున, కార్తీ హీరోలుగా తెరకెక్కిన మల్టీ స్టారర్ ఊపిరి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. భారీ హిట్ నుంచి ఆల్ టైం హిట్స్ లో ఒకటిగా ఓవర్సీస్ లో దూసుకుపోతోంది ఊపిరి. ఫ్రెంచి సినిమా ఇంటచిబుల్ప్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాపై మొదటినుంచే పాజిటివ్ బజ్ ఉండటం ప్లస్ అయింది. క్లాస్ సినిమాలకు ఓవర్సీస్ లో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పుడు అదే కోవలో నాగార్జున ఊపిరి కూడా చేరింది. ట్రేడ్ పండితుల ప్రకారం, అమెరికాలో ఆల్ టైం హయ్యస్ట్ గ్రాసింగ్ ఫిలిమ్స్ లో ఊపిరి కూడా చేరింది. 1.6 మిలియన్ డాలర్లతో బాహుబలి, శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో, అత్తారింటికి దారేది సినిమాల తర్వాతి స్థానంలో ఊపిరి నిలిచింది. ఇప్పటి వరకూ ఓవర్సీస్ లో నాగార్జున సినిమాల్లో అత్యధిక కలెక్షన్ కూడా ఊపిరిదే. కేవలం వీల్ చైర్ కే అతుక్కుపోయిన మిలియనీర్ పాత్రలో నాగ్ తనలోని నటుడ్ని ఆవిష్కరిస్తే, సరదా కుర్రాడిలా కార్తి అలరించాడు. మరి కొన్ని రోజుల పాటు, యుఎస్ లో ఊపిరి డ్రీమ్ రన్ కంటిన్యూ అవతుందని ట్రేడ్ అనలిస్ట్ లు చెబుతున్నారు. అది జరిగితే, ఊపిరి టాప్ 3 లోకి వచ్చేసినా ఆశ్చర్యం లేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



