సమంతతో విడాకుల వ్యవహారం.. 'చైతూ నా గురించి ఆందోళనపడ్డాడు'!
on Jan 27, 2022

సమంత, నాగ చైతన్య విడాకుల ప్రకటన వారి ఫ్యాన్స్‌ను షాక్‌కు గురి చేసింది. ఒకప్పుడు ఫేవరెట్ టాలీవుడ్ స్టార్ కపుల్, 4 సంవత్సరాల తమ వైవాహిక బంధానికి ముగింపు పలికి, ఎవరి దారి వారు చూసుకున్నారు. అప్పట్నుంచీ వారి విడాకుల వెనుక కారణాలేమై ఉంటాయా అని జనం ఊహించడం ప్రారంభించారు. సమంత కానీ, చైతన్య కానీ తామెందుకు విడిపోవాలని నిర్ణయించుకున్నారనే అంశంపై ఇంతదాకా మాట్లాడలేదు. ఇప్పుడు నాగార్జున ఆ జంట విడిపోవడానికి ఏం జరిగి ఉంటుందనే దానిపై హింట్ ఇచ్చారు.
ఇటీవలి ఇంటర్వ్యూలో, "ఇద్దరిలో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న మొదటి వ్యక్తి సమంత" అని నాగ్ వెల్లడించారు. "నాగ చైతన్య ఆమె నిర్ణయాన్ని ఆమోదించాడు. కాని అతను నా గురించి చాలా ఆందోళన చెందాడు. నేనేం అనుకుంటానోననీ, కుటుంబ ప్రతిష్ఠ ఏమవుతుందోనని ఆందోళన పడ్డాడు" అని ఆయన చెప్పాడు.
Also read: హిమజకు టెన్త్ క్లాస్‌లో దసరా రోజు ప్రపోజ్ చేసిన అబ్బాయి!
సమంత, చైతన్య విడాకుల వెనుక అసలు కారణంపై నాగార్జున ఇంకా ఏమన్నారంటే.. "నేను ఆందోళన చెందుతానని నాగ చైతన్య నన్ను చాలా ఓదార్చాడు. వారిద్దరూ వైవాహిక బంధంలో 4 సంవత్సరాలు కలిసున్నారు. కానీ ఇది జరిగే దాకా వారి మధ్య ఎలాంటి సమస్యా రాలేదు.. ఇద్దరూ చాలా క్లోజ్‌గా ఉన్నారు. మరి ఈ నిర్ణయానికి ఎలా వచ్చారో నాకు తెలియదు. వాళ్లిద్దరూ కలిసి 2021 న్యూ ఇయర్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ తర్వాతే ప్రాబ్లెమ్స్ తలెత్తినట్లు తెలుస్తోంది."
Also read: జయలలిత ఒక మలయాళం డైరెక్టర్‌ను పెళ్లాడి, విడాకులు తీసుకున్నారని మీకు తెలుసా?
తన కొడుకు సమంతతో విడిపోయిన తర్వాత ఎలా వ్యవహరించాడో చూసి గర్వపడ్డానని రెండు వారాల క్రితం నాగార్జున చెప్పారు. ఇటీవల నాగ చైతన్య కూడా తన మౌనాన్ని వీడి, తమ పరస్పర ప్రయోజనాల దృష్ట్యా తన భార్య సమంతతో విడిపోవాలనే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. అంతకుముందు సమంత మాట్లాడుతూ.. విడిపోయాక తాను కుప్పకూలి చనిపోతానని భావించానని చెప్పింది. కానీ, అన్ని సమస్యలతో తన జీవితాన్ని జీవించబోతోందని గ్రహించినందున, తనను తాను అలాంటి బలమైన మహిళగా అభినందించుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



