నాగార్జున నిజమైన ఇండియన్ గేమ్ చేంజర్
on Oct 5, 2024
యువసామ్రాట్ అక్కినేని నాగార్జున(nagarjuna)ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(ram gopal varma)కాంబోలో 1985 అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ శివ(siva)అంటే నేటికీ ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుంది.ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ నాగ్, వర్మ లని ఓవర్ నైట్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద స్టార్స్ గా నిలబెట్టడంతో పాటు ఒక ట్రెండ్ సెట్ గా కూడా నిలిచింది.
మరి ఈ సినిమా వచ్చి నేటికి 35 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా నాగ్ అండ్ వర్మలు శివ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా ద్వారా తమ ఆనందాన్నివ్యక్తం చేస్తున్నారు.కానీ అసలు ట్రీట్ ఎప్పుడు అనేది మాత్రం రివీల్ చేయలేదు.ప్రస్తుతం రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. దీంతో శివ రీ రిలీజ్ పై నాగ్ అభిమానుల్లోనే కాకుండా ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మేరకు కొన్ని రోజుల క్రితం విడుదలైన మాస్ రీరిలీజ్ కి రిలీజ్ చేసిన శివ గ్లింప్స్ ఊహించని ఫీస్ట్ ని ఇచ్చింది. దీనితో రీ రిలీజ్ డేట్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.
ఇక శివ ఎప్పుడు రీ రిలీజ్ అయినా కూడా అనేక రికార్డులు తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అన్నపూర్ణ స్టూడియోస్ పై నాగార్జునే శివకి నిర్మాతగా వ్యవహరించగా అమల(amala)రఘువరన్(raghu varan)గోపిచంద్(gopi chand)శుభలేఖ సుధాకర్, చిన్న, తనికెళ్ళ భరణి, వంటి వారు ప్రధాన పాత్రల్లో చెయ్యగా ఇళయరాజా సంగీతాన్ని అందించాడు.
Also Read