రాజేంద్రప్రసాద్ ని ఓదార్చిన అల్లు అర్జున్..గాయత్రి భౌతిక దేహానికి నివాళి
on Oct 5, 2024
నాలుగున్నర దశాబ్డల పై నుంచి తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్న ప్రముఖ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్(rajendra prasad)గారి కుమార్తె శ్రీమతి గాయత్రి హఠాన్మరణం పలువురిని దిగ్భ్రాంతికి గురి చేస్తుంది.దీంతో సినీ పరిశ్రమకి చెందిన పలువురు ప్రముఖులతో పాటు అభిమానులు రాజేంద్రప్రసాద్ కి తమ ప్రగాఢ ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నారు.
ప్రముఖ అగ్ర హీరో అల్లు అర్జున్(allu arjun)కొద్దీ సేపటి క్రితమే రాజేంద్రప్రసాద్ నివాసానికి వెళ్లి గాయత్రి పార్దిక దేహానికి నివాళులు అర్పించాడు.అనంతరం రాజేంద్ర ప్రసాద్ ద్వారా గాయత్రి మరణానికి గల కారణాలని అడిగి తెలుసుకున్నాడు.రాజేంద్ర ప్రసాద్,అల్లు అర్జున్ మధ్య చాలా సన్నిహిత సంబంధం ఉంది.అల్లు అర్జున్ హిట్ చిత్రాలైన జులాయి,సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురం సినిమాల్లో రాజేంద్రప్రసాద్ ప్రాముఖ్యత గల పాత్రలని పోషించాడు.
Also Read