చైతూ - సమంత పెళ్లికి ఒప్పుకొన్న నాగ్
on Sep 8, 2016
నాగచైతన్య - సమంతలు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారన్నది ఓపెన్ సీక్రెట్టే. ఇద్దరూ ఎక్కడపడితే అక్కడ చెట్టాపట్టాలేసుకొని జంటగా తిరుగుతున్నారు. ఈమధ్య ఓ పెళ్లికి కూడా వెళ్లొచ్చారు. అయితే ఇటు సమంత, నాగచైతన్యలుగానీ... అటు నాగార్జున గానీ ఈ పెళ్లి గురించి ఇప్పటి వరకూ పెదవి విప్పలేదు. ఒక్కసారి కూడా.. స్పందించలేదు. అయితే తొలిసారి ఈ ప్రేమ వ్యవహారంపై నాగార్జున స్పందించాడు. చైతూ - సమంతల పెళ్లి గురించి మాట్లాడాడు. ఈరోజు సాయింత్రం హైదరాబాద్‌లోని నాగార్జున స్వగృహంలో ఓ ప్రెస్‌మీట్ జరిగింది. అక్కడ చైతూ పెళ్లి ప్రస్తావన వచ్చింది. పెళ్లి కూతురు ఎవరు? అని పాత్రికేయులు అడిగితే. ``మీకు తెలియంది ఏముంది? మీరే రాస్తున్నారు, ఫొటోలు వేస్తున్నారు... సమంత అని.. తనే`` అంటూ డైరెక్టుగా చెప్పేశారు. అయితే పెళ్లెప్పుడన్నది కన్‌ఫామ్ చేయలేదు. అఖిల్ నిశ్చితార్థం మాత్రం డిసెంబరు 9న ఉండొచ్చన్నారు. వచ్చే యేడాది చైతూ, అఖిల్ ల పెళ్లి ఉండొచ్చని చెప్పారు. సో.. నాగ్ చెప్పేశారు కాబట్టి.. త్వరలోనే చైతూ, సమంతలు కూడా బయటపడిపోవొచ్చు.