నాగ్ విడాకుల మ్యాటర్ మళ్లీ తవ్వుతున్నారు..?
on Feb 2, 2017
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన నాగచైతన్య-సమంతల ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. పెద్దగా హడావిడి లేకుండా సింపిల్‌గా చాలా గ్రాండ్‌గా వీరి నిశ్చితార్ధాన్ని నిర్వహించారు..సాధారణంగా సెలబ్రెటీల ఈవెంట్లు ముగిసిన తర్వాత ఆ కార్యక్రమానికి వచ్చిన అతిథుల గురించో..పెళ్లి కొడుకు/పెళ్లి కూతురు వేసుకున్న కాస్ట్యూమ్స్ గురించే మాట్లాడుకుంటారు..మీడియా కూడా వాటినే టార్గెట్ చేస్తుంది. కానీ ఆశ్చర్యకరంగా పెళ్లి కొడుకు తండ్రి గురించి...ఆయన పాస్ట్ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడితే..అవును ఇప్పుడు మీడియా అంతా మాట్లాడుకుంటుంది నాగార్జున మొదటి భార్య గురించి..వారిద్దరూ విడిపోవడం గురించే.
నాగచైతన్య తల్లి, నాగార్జున మొదటి భార్య దగ్గుబాటి లక్ష్మీ ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి తన ప్రస్తుత భర్తతో కలిసి హాజరవ్వడంతో మీడియా పాత విషయాలను తవ్వితీస్తోంది. నాగార్జున-లక్ష్మీ ఎలా విడిపోయారు అంటూ వెబ్ మీడియా, యూట్యూబ్‌లో కథనాలు తెగ హల్చల్ చేస్తున్నాయి. అంతా మరచిపోయి హ్యాపీగా ఉంటున్న ఇలాంటి టైంలో ఆ విషయాలు గుర్తొచ్చి మళ్లీ బాధపడటం తప్పించి ఇక్కడ ఒరిగేదేం లేదు.