చైతూ పై 24 కోట్ల బెట్టింగ్
on Aug 10, 2016
.jpg)
ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్లాలంటే.. హీరో ఎవరన్నది ఎంత ముఖ్యమో, బడ్జెట్ ఎంత పెడుతున్నాం అనేది అంతే ముఖ్యం. పిండి కొలదీ రొట్టె.. హీరో స్థాయిని బట్జి బడ్జెట్. ఈ విషయంలో తేడా జరిగిందంటే... నిర్మాతలు నెత్తిమీద చెంగు వేసుకోవాల్సిందే. ఎలాంటి హీరోలకైనా ఇలాంటి భంగపాటు తప్పదు. ఇప్పుడు నాగచైతన్య సినిమాకీ అదే పరిస్థితి ఎదురవుతోందని టాక్. నాగచైతన్య - గౌతమ్ మీనన్ కలయికలో రూపుదిద్దుకొన్న చిత్రం "సాహసం శ్వాసగా సాగిపో". ఈ సినిమా పడుతూ లేస్తూ.. పడుతూ లేస్తూ పూర్తయ్యింది. వేసవికి రావాల్సిన ఈ సినిమా.. వాయిదాల మీద వాయిదాలు పడుతూనే వస్తోంది. సెప్టెంబరులో ఈ సినిమాని ఎలాగైనా విడుదల చేయాలన్నది చిత్రబృందం ఆలోచన.
అయితే ఇప్పటికే ఈ సినిమా బడ్జెట్ తడిసి మోపెడయ్యిందట. చైతూ సినిమా అంటే రూ.10 కోట్ల లోపే పూర్తి చేసుకోవాలి. ఈ అంకె దాటిందంటే.. కష్టమే. ఎందుకంటే చైతూ మార్కెట్ రేంజ్ అంతే. గౌతమ్ మీనన్ కాస్త పెద్ద దర్శకుడు కాబట్టి మరో నాలుగు కోట్లు పెరిగితే పెరిగిందనుకోవొచ్చు. కానీ ఈ సినిమాకి ఇప్పటి వరకూ 22 కోట్లు అయ్యిందట. ప్రమోషన్లకు మరో రెండు కోట్లయినా కావాలి. అంటే ఈ సినిమా బయటకు వచ్చేటప్పటికి రూ.24 కోట్లవుతుంది. సినిమా ఎంత పెద్ద హిట్టయినా దాన్ని రికవరి చేయడం కష్టం. అసలే సినిమా ఆలస్యమైంది. ఇప్పుడు ఓపెనింగ్స్ కూడా రావు. మరి ఏం నమ్మి ఈ సినిమాపై ఇన్ని కోట్లు పెట్టారో మరి. చైతూ సినిమాలో ఎన్ని సాహసాలు చేశాడో తెలీదుగానీ... చైతన్య కోసం నిర్మాతలు మాత్రం పెద్ద సాహసమే చేస్తున్నారిప్పుడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



